Moviesప్ర‌భాస్ - అనుష్క పెళ్లిపై అడ‌వి శేష్ షాకింగ్ కామెంట్స్‌

ప్ర‌భాస్ – అనుష్క పెళ్లిపై అడ‌వి శేష్ షాకింగ్ కామెంట్స్‌

ముదురు హీరోల‌ను పెళ్లి ఎప్పుడు అని అడ‌గ‌డం పాపం చాలా తెలివిగా స‌మాధానం దాట‌వేస్తూ ఉంటారు. ప్ర‌భాస్ నాలుగు ప‌దుల వ‌య‌స్సులో ఉన్నా కూడా పెళ్లి ఎప్పుడు అని అడిగితే ఏదో ఒక ఆన్స‌ర్ చెపుతూ త‌ప్పించుకుంటూ వ‌స్తున్నాడు. ఇంకా పెళ్లి కావాల్సిన హీరోల్లో యంగ్ ఎన‌ర్జిటిక్ రామ్ కూడా ఉన్నాడు. రామ్ వ‌య‌స్సు కూడా మూడున్న‌ర ప‌దుల‌కు చేరువ అయ్యింది. రామ్ కూడా ఇంకా పెళ్లి ఊసు ఎత్త‌డం లేదు. ఈ లిస్టులోనే మ‌రో ముదురు హీరో అడ‌వి శేష్ కూడా ఉన్నాడు.

తాజాగా అడ‌వి శేష్‌ను ఇదే ప్ర‌శ్న అడిగితే చాలా తెలివైన ఆన్స‌ర్ ఇచ్చాడు. ప్ర‌భాస్ – అనుష్క‌కు ఇంకా పెళ్లి కాలేదు క‌దా ? వాళ్ల‌కు పెళ్ల‌య్యాకే త‌న పెళ్లి అన్న‌ట్టుగా మాట్లాడాడు. ఇండ‌స్ట్రీలో పెళ్లి కావాల్సిన వాళ్లు ఇంకా చాలా మందే ఉన్నారు. వాళ్ల‌కు పెళ్ల‌య్యాక చూద్దాం.. నా ఫ్రెండ్ అనుష్క ఉంది.. ఇంకా పెళ్లి చేసుకోలేదు. రాన‌కు పెళ్ల‌య్యింది. కానీ ఇంకా ప్ర‌భాస్‌కు పెళ్లి కాలేదు.. వాళ్ల పెళ్లిళ్లు అయ్యాక తాను పెళ్లి చేసుకుంటా అన్నాడు.

అయితే త‌న‌కు ల‌వ్ ప్ర‌పోజ‌ల్స్ చాలానే ఉన్నాయి. అయితే త‌న‌కు ప్ర‌పోజ్ చేసిన వారిలో పెళ్ల‌యిన ఆంటీలు, మ‌హిళ‌లు కూడా ఉన్నార‌ని శేష్ చెప్పాడు. త‌న భ‌ర్త‌ను వ‌దిలేసి వ‌చ్చేస్తా… పెళ్లి చేసుకో అని చెప్పిన వారు కూడా ఉన్నార‌ని శేష్ అన్నాడు. ఇక పెళ్లి చేసుకోమ‌ని మా అమ్మ రోజూ స‌తాయిస్తోంది. చివ‌ర‌కు మా అమ్మ వాళ్లు ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకోమ‌ని చెపుతున్నారు.. కొరియ‌న్ అమ్మాయి అయినా ఓకే అనే స్టేజ్‌కు వ‌చ్చేశారు.. కానీ నాకు మాత్రం ఎవ్వ‌రూ సెట్ కావ‌డం లేద‌ని శేషు తెలిపాడు.

ఇక శేష్ ప్ర‌స్తుతం మేజ‌ర్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక గూఢ‌చారి – 2 స్టార్ట్ చేస్తాడు. గూఢ‌చారి సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యిందో మ‌నం చూశాం. అయితే గూఢ‌చారి సినిమాకు సీక్వెల్ చేస్తాన‌ని శేష్ ఎప్పుడో చెప్పాడు. దీంతో చాలా మంది ఈ సినిమా షూటింగ్ స‌గం పూర్త‌య్యింద‌ని అనుకుంటున్నారు. వాస్త‌వంగా ఈ సినిమా పోస్ట‌ర్ మాత్ర‌మే రిలీజ్ చేశామ‌ని.. క‌థ‌పై వ‌ర్క‌వుట్ కూడా చేయ‌లేని చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news