Moviesబిగ్ షాకింగ్‌: ఆ స్టార్ హీరోయిన్ రెండు నెల‌ల ప్రెగ్నెంట్‌... !

బిగ్ షాకింగ్‌: ఆ స్టార్ హీరోయిన్ రెండు నెల‌ల ప్రెగ్నెంట్‌… !

ఎస్ ఇప్పుడు ఇదే వార్త నేష‌న‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఓ స్టార్ హీరోయిన్ రెండు నెల‌లు ప్రెగ్నెంట్ అంటున్నారు. రెండు ద‌శాబ్దాలుగా అటు బాలీవుడ్‌లోనూ.. ఇటు తెలుగులో కూడా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె ఇటీవ‌లే ఓ యంగ్ హీరోను పెళ్లాడింది. అయితే ఇప్పుడు ఆమె రెండు నెల‌ల ప్రెగ్నెంట్ అని వ‌స్తోన్న వార్త‌లు మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు క‌త్రినా కైఫ్‌. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ త‌న కంటే చిన్నోడు అయిన యంగ్ హీరో విక్కీ కౌశ‌ల్‌ను పెళ్లాడింది.

విక్కీతో క‌త్రినా ఏకంగా రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా డేటింగ్‌లో ఉంది. ఎక్క‌డ చూసినా వారిద్ద‌రు క‌లిసే క‌నిపించే వాళ్లు. ఎట్ట‌కేల‌కు ఊరించి ఊరించి ఈ జంట ఇటీవ‌లే పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి జ‌రిగి కూడా రెండు నెల‌లే అయ్యింది. ఇలా పెళ్లి జ‌రిగిందో లేదో వెంట‌నే క‌త్రినా రెండు నెల‌ల గ‌ర్భిణీ అన్న వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ వెబ్‌సైట్ రాసిన వార్త ఇలా క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోయింది. ఇంత‌లోనే ఏం జ‌రిగిందో కాని.. ఈ ఆర్టిక‌ల్ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల‌కే ఆ సైట్ ఆ వార్త‌ను తొల‌గించేసింది. క‌త్రినా కైఫ్ పీఆర్వో టీం ఆఘ‌మేఘాల మీద స్పందించి ఆ వార్త‌ను తొల‌గించేలా చేసింద‌ని అంటున్నారు. ఏదేమైనా క‌త్రినా – విక్కీ ఇద్ద‌రూ కూడా రెండున్నర సంవ‌త్స‌రాలుగా డేటింగ్‌లోనే ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే పెళ్లికి ముందు నుంచే వీరు అన్ని విధాలుగా క‌లుసుకునే ఉండొచ్చు. ఈ క్ర‌మంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఉండ‌వ‌చ్చ‌ని ఓ టాక్‌. అయితే ఈ వార్త‌ను ఇప్పుడు ఆ టాప్ వెబ్సైట్ తొల‌గించ‌డంతో క‌త్రినా లేదా విక్కీ అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కు క‌త్రినా ప్రెగ్నెంట్ అన్న‌ది న‌మ్మ‌లేం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news