Moviesఇన్నర్ వేర్స్ గురించి జోకులు..చైతన్య తప్పు చేసాడా..?

ఇన్నర్ వేర్స్ గురించి జోకులు..చైతన్య తప్పు చేసాడా..?

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ లీడ్ పాత్రలో నటిస్తున్న మూవీ లాల్ సింగ్ చద్దా . 2018లో థగ్స్ అఫ్ హిందుస్థాన్ రూపంలో భారీ డిజాస్టర్ అందుకున్నాక ఆమిర్ ఖాన్ మళ్ళీ తెరమీద కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కు భారీ అంచనాలున్నాయి. దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత ఆమిర్ న‌టించిన సినిమా. అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆమిర్ ఖాన్‌, కిర‌ణ్ రావ్‌, జ్యోతి దేశ్ పాండే, వ‌యాకామ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 11న సినిమా ధియేతర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అంతేకాదు సినిమాలో ఎమోషన్ల్ సీన్స్ అభిమానుల కంట నీరు తెప్పిస్తుందని మేకర్స్ ఇది వరకె తెలియజేశారు. డైనమిక్ డైరెక్టర్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై అభిమానులో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కాగా, సినిమా రిలీజ్ డేట్ దగ్గర పదుతుండటంతో..చిత్ర మేకర్స్ సినిమా ట్రైలర్ ను ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు విడుదల చేశారు.

చిత్ర ట్రైలర్ కి మ్మచి స్పందన లబించింది. ఇక చిత్ర ట్రైల‌ర్‌ విషయానికి వస్తే..ఓ మాన‌సికంగా ఎదుగుద‌లేని వ్య‌క్తి, త‌న జీవితంలో ఎలా సంతోషంగా గదుపుతాదూ..ఆ సంతోషాన్ని ఎలా వెతుక్కుంటాడు. సిరిగ్గా న‌డ‌వలేని స్థితి నుంచి పరుగుల పోటీల్లో విజేత‌గా ఎలా నిలుస్తాడు.. అనే అంశాల‌తో తెరకెక్కిన్నత్లు కనిపిస్తుంది. ఇప్పటికే ఈ లాల్ సింగ్ చద్దా ట్రైలర్ ఇప్పటికే 20 మిలియన్ల వ్యూస్ దాటేసి కొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతోంది. అయితే, ఈ ట్రైలర్ లో చైతూ , అమీర్ ఖాన్ తో ఇన్నర్ వేర్స్ గురించి ఫన్నీ గా జోకులు వేసుకుంటూ..కనిపించాడు.

దీంతో అక్కినేని ఫ్యాన్స్ మందిపడుతున్నాడు. చైతు రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేసిన జనాలకు ఆ పర్ ఫామెన్స్ నచ్చలేదు. ఫన్నీ గా ఉండే క్యారెక్టర్ అమీర్ కి సెట్ అవుతుంది కానీ.. అక్కినేని ఫ్యాన్స్ చైతన్య నుండి అది ఎక్స్ పెక్ట్ చేయలేదు అంటూ..టృఓల్ చేస్తున్నారు.దీంతో చై ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ మిగిల్చింది ట్రైలర్..మరి సినిమా లో ఎలా ఉంటాడో..చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news