Moviesఎన్టీఆర్ - కొర‌టాల రెండు క్రేజీ అప్‌డేట్లు వ‌చ్చేశాయ్‌...!

ఎన్టీఆర్ – కొర‌టాల రెండు క్రేజీ అప్‌డేట్లు వ‌చ్చేశాయ్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా సినిమా రాబోతోన్న సంగ‌తి తెలిసిందే. త్రిబుల్ ఆర్ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు మామూలుగా లేవు. ఎన్టీఆర్ 30 ప్రాజెక్టుగా వ‌స్తోన్న ఈ సినిమా యేడాది క్రిత‌మే స్టార్ట్ అయినా ఇప్ప‌ట‌కీ సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. క‌రోనా వాయిదాలు… ఇటు త్రిబుల్ ఆర్‌, అటు ఆచార్య కూడా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తుండ‌డంతో ఈ సినిమా ఇంకా ప‌ట్టాలు ఎక్క‌లేదు. ద‌ర్శ‌కుడు కొర‌టాల అయితే ఎప్ప‌టి నుంచో ఈ సినిమాకు ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేసి.. కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి రెండు ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్స్ అయితే బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ మేకోవ‌ర్ చాలా కొత్త‌గా ఉండ‌బోతోంద‌ట‌. స‌రికొత్త లుక్‌లో తార‌క్ క‌నిపించ‌నున్నాడు. ఈ లుక్ కోస‌మే ఇప్ప‌టికే 8 – 9 కిలోల బ‌రువు కూడా త‌గ్గిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆంజ‌నేయ‌స్వామి దీక్ష‌లో కూడా ఉన్నాడు. ఈ దీక్ష ముగిసిన వెంట‌నే బాడీ మ‌రింత త‌గ్గుతుంద‌ని అంటున్నారు.

ఈ సినిమాలో త్రిబుల్ ఆర్ లో చేసిన బాలీవుడ్ న‌టి అలియా భట్‌ను ముందుగా హీరోయిన్‌గా తీసుకున్నారు. త్రిబుల్ ఆర్ ప్ర‌మోష‌న్ల‌లో ముంబైలోనే ఈ విష‌యాన్ని ఆమె క‌న్‌ఫార్మ్ కూడా చేసింది. ఇక అలియా – ఎన్టీఆర్ కాంబోనే అని అంద‌రూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి అలియా త‌ప్పుకుంది. తాజాగా ఆమె పెళ్లి అయ్యింది. పెళ్లి అయిన వెంట‌నే సినిమాల్లో న‌టిస్తే బాగోద‌ని… కొంత కాలం పాటు ఆమె గ్యాప్ తీసుకోబోతోంది.

ఈ విష‌యాన్ని ఆమె చిత్ర యూనిట్‌కు చెప్పి ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే అలియా అవుట్ అవ్వ‌డంతో ఇప్పుడు ఎన్టీఆర్‌కు జోడీ క‌ట్టే ల‌క్కీ ఛాన్స్ కియారా అద్వానీకి ద‌క్కింది. ఆమె తెలుగులో ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ – శంక‌ర్ సినిమాలో న‌టిస్తోంది. అంత‌కు ముందే కియారా కొర‌టాల డైరెక్ట్ చేసిన భ‌ర‌త్ అనే నేను సినిమా చేసింది.

ఇక ఇప్పుడు కియార‌కు ఉన్న క్రేజ్ నేప‌థ్యంలోనే ఆమెనే తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌ధ్య‌లో శ్రీదేవి కూతురు జాన్వీక‌పూర్ పేరు వినిపించినా చివ‌ర‌కు కొర‌టాల కియారా వైపే మొగ్గు చూపాడ‌ట‌. ఎన్టీఆర్ – కొర‌టాల కాంబోలో జ‌న‌తా గ్యారేజ్ లాంటి సూప‌ర్ హిట్ ఉంది. మరోసారి వీరి కాంబోలో వ‌స్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news