Moviesముగ్గురు హీరోయిన్ల ముద్దుల హీరో ప‌వ‌ర్‌స్టార్‌... ఆ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ఫిక్స్‌..!

ముగ్గురు హీరోయిన్ల ముద్దుల హీరో ప‌వ‌ర్‌స్టార్‌… ఆ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ఫిక్స్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత వ‌కీల్‌సాబ్ సినిమాతో గ‌తేడాది రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ యేడాది భీమ్లానాయ‌క్ సినిమాతో రానాతో క‌లిసి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ రెండు సినిమాలు రీమేక్‌లే అయినా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌ర్వాలేద‌నిపించుకున్నాయి. ఇక ఇప్పుడు వ‌రుస పెట్టి ప‌వ‌న్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాతో పాటు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్ సినిమాకు కూడా చేస్తున్నారు.

గ‌తంలో హ‌రీష్ శంక‌ర్ – ప‌వ‌న్ కాంబినేష‌న్లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే ప‌వ‌న్‌కు జ‌ల్సా త‌ర్వాత ఆ రేంజ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ప‌వ‌న్‌కు మ‌ళ్లీ 2011లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాతోనే ద‌క్కింది. ప‌వ‌న్ మాస్ అభిమానులు గ‌బ్బ‌ర్‌సింగ్ మానియాలో మునిగి తేలారు. ఆ త‌ర్వాత వెంట‌నే ప‌వ‌న్‌కు అత్తారింటికి దారేది రూపంలో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ వ‌చ్చింది.

ఇక ఇప్పుడు మ‌రోసారి గ‌బ్బ‌ర్‌సింగ్ కాంబినేష‌న్ రిపీట్ అవుతుంద‌న్న ప్ర‌క‌ట‌న‌తో అంచ‌నాలు అన్నీ గ‌బ్బ‌ర్‌సింగ్ రేంజ్‌లోనే ఉన్నాయి. అటు హ‌రీష్ శంక‌ర్ కూడా త‌న‌దైన స్టైల్లోనే అంచ‌నాలు పెంచుతూ టైటిల్ రివీల్ చేశారు. భ‌వ‌దీయుడు అంటే ఖ‌చ్చితంగా క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉంటుంద‌నే ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేస్తోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా త‌ర్వాత ఇది సెట్స్ మీద‌కు వెళుతుంది. ప‌వ‌న్ డేట్లు ఇవ్వ‌డ‌మే ఆల‌స్యం.. ఈ సినిమాను చ‌క‌చ‌కా పూర్తి చేసేయాల‌ని హ‌రీష్ శంక‌ర్ ప్లానింగ్‌తో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మ‌లు ప‌వ‌న్ ప‌క్క‌న హీరోయిన్లుగా క‌నిపిస్తారు.

ఇందులో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ఫిక్స్ అయిపోయార‌ని తెలుస్తోంది. వీరిలో ఒక‌రు అందాల భామ పూజా హెగ్డే. పూజ ప్ర‌స్తుతం సౌత్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉంది. వ‌రుస పెట్టి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఆమెకు ప‌వ‌న్‌తో ఇదే తొలి సినిమా అవుతుంది. ఇక మ‌రో హీరోయిన్‌గా ప‌వ‌న్‌కు క‌లిసొచ్చిన శృతీహాస‌న్‌ను ఎంపిక చేసిన‌ట్టు టాక్ ? గ‌తంలో ప‌వ‌న్ ప‌క్క‌న ఆమె గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు, వ‌కీల్‌సాబ్ సినిమాలు చేసింది.

ప‌వ‌న్ – హ‌రీష్ కాంబోలో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాలో కూడా శృతీయే హీరోయిన్‌. ఆ సెంటిమెంట్ నేప‌థ్యంలోనే ప్లాష్‌బ్యాక్‌లో వ‌చ్చే హీరోయిన్ పాత్ర కోసం హ‌రీష్ శంక‌ర్ శృతీనే ఫైన‌లైజ్ చేశార‌ని అంటున్నారు. మూడో హీరోయిన్ కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. ఇక ప‌వ‌న్ లెక్చ‌ర‌ర్‌గా క‌నిపిస్తుండ‌గా.. కాలేజ్ నేప‌థ్యంలో వ‌చ్చే సీన్లు సినిమాకు హైలెట్ అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news