Moviesమెగాస్టార్‌కు మ‌ర‌ద‌లిగా కుర్ర హీరోయిన్‌... !

మెగాస్టార్‌కు మ‌ర‌ద‌లిగా కుర్ర హీరోయిన్‌… !

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. చిరు ఏకంగా ఐదు సినిమాల‌ను లైన్లో పెట్టేశాడు. ఈ యేడాది.. వ‌చ్చే యేడాది చిరు అభిమానుల‌కు మామూలు పండ‌గ కాదు. ఈ యేడాది ఏప్రిల్ 29న ఆచార్య‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమాలో చిరుతో పాటు త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ కూడా ఉండ‌డంతో మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధులే ఉండ‌వు. చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, చెర్రీ ప‌క్క‌న పూజా హెగ్డే రొమాన్స్ చేస్తున్నారు.

ఆ త‌ర్వాత వ‌రుస‌గా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న భోళా శంక‌ర్‌, మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న గాడ్ ఫాద‌ర్ ( మ‌ళ‌యాల లూసీఫ‌ర్ రీమేక్‌) రెండు లైన్లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు స‌మాంత‌రంగా షూటింగ్ జ‌రుపుకోనున్నాయి. ఈ రెండు కూడా రీమేక్ కావ‌డం మ‌రో విశేషం. లూసీఫ‌ర్ రీమేక్‌గా గాడ్ ఫాద‌ర్‌, కోలీవుడ్‌లో అజిత్ హీరోగా వ‌చ్చిన వేదాళం రీమేక్‌గా భోళాశంక‌ర్ వ‌స్తున్నాయి.

ఇక ఈ రెండు సినిమాల‌తో పాటు జైల‌వ‌కుశ, వెంకీమామ డైరెక్ట‌ర్ బాబి ద‌ర్శ‌క‌త్వంలో చిరు 154 తెర‌కెక్కుతోంది. ఈ సినిమా ప‌నులు కూడా స్టార్ట్ అయ్యాయి. సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ ఇప్ప‌టికే మూడు పాట‌లు రెడీ చేసి పెట్టుకున్నాడు. బాబి క‌థ‌, మాట‌లు అందిస్తోన్న ఈ సినిమాకు కోన వెంక‌ట్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కూడా న‌టిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతీహాస‌న్‌ను సెట్ చేశారు. చిరు ప‌క్క‌నే మ‌రో రోల్ కూడా ఉంది. ఇది మ‌ర‌ద‌లి రోల్‌.. ఈ రోల్ కోసం నివేద పేతురాజ్‌ను తీసుకున్నారు. నివేద ర‌వితేజ‌కు జోడీగా క‌నిపించ‌బోతోంది. ర‌వితేజ‌ది సినిమాలో చిరు త‌మ్ముడు పాత్ర అంటున్నారు. అంటే నివేద చిరంజీవికి మ‌ర‌ద‌లిగా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్టు టాక్ ?

నివేద తెలుగులో ఇప్ప‌టికే చిత్రలహరి, బ్రోచేవారెవరురా, రెడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె గ్లామ‌ర్ పాత్ర‌లే కాకుండా.. న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లు కూడా ఎంచుకుంటోంది. ఇప్పుడు ఏకంగా చిరంజీవి – ర‌వితేజ సినిమాలో ఆఫ‌ర్ అంటే ఖ‌చ్చితంగా ఇది ఆమె కెరీర్‌ను ట‌ర్న్ చేస్తుంద‌ని అంటున్నారు. మ‌రి చూడాలి నివేద అదృష్టం ఎలా ఉంటుందో ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news