Moviesఏపీలో RRR టిక్కెట్ రేట్లు ఇవే... టిక్కెట్లు అడ‌గొద్దు ప్లీజ్‌..!

ఏపీలో RRR టిక్కెట్ రేట్లు ఇవే… టిక్కెట్లు అడ‌గొద్దు ప్లీజ్‌..!

త్రిబుల్ ఆర్ రిలీజ్‌కు మ‌రో 8 రోజుల టైం మాత్ర‌మే ఉంది. ప్ర‌మోష‌న్లు మాత్రం పీక్ స్టేజ్‌లోనే హోరెత్తుతున్నాయి. ఏపీలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ముందు వ‌ర‌కు ఒక ప‌రిస్థితి ఉంటే ఈ సినిమా నుంచి మ‌రో ప‌రిస్థితి ఉంది. గ‌తంలోనే సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి సినీ బృందంలో ఉన్న ఈ సినిమా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి నిన్న నిర్మాత దాన‌య్య‌తో క‌లిసి మ‌రోసారి జ‌గ‌న్‌ను క‌లిశారు. సినిమా భారీ బ‌డ్జెట్ నేప‌థ్యంలో ఈ సినిమాకు ప్ర‌త్యేక అనుమ‌తులు ఇచ్చింది. టిక్కెట్‌పై రు. 100 పెంచుకునే వెసులు బాటు ఏపీలో త్రిబుల్ ఆర్ సినిమాకు వ‌చ్చింది. ఇక ఐదో షోకు కూడా అనుమ‌తులు వ‌చ్చేశాయ్‌.

ఈ టిక్కెట్ రేట్ల పెంపుతో పాటు ఐదో షోకు కూడా అనుమ‌తి ఇవ్వ‌డంతో ఏపీలో కూడా త్రిబుల్ ఆర్ బాక్సాఫీస్ దగ్గ‌ర దండ‌యాత్ర‌కు రెడీ అవుతోంది. బొమ్మ‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ వ‌స్తే అన‌కాప‌ల్లి లేదు ఆదిలాబాదూ లేదు… హైద‌రాబాద్‌, అమెరికా ఇలా ఎక్క‌డ చూసినా క‌లెక్ష‌న్ల ఊచ‌కోత కోసేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక ఏపీలో టిక్కెట్ల ధ‌ర‌లు పెర‌గ‌డంతో అక్క‌డ త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యే థియేట‌ర్ల‌లో క‌నిష్టంగా రు. 120.. గ‌రిష్టంగా రు. 265 గా టిక్కెట్ రేట్లు ఉన్నాయి. క‌నిష్టంగా రు.120 గా టిక్కెట్ రేట్లు డిసైడ్ చేయ‌డంతో త్రిబుల్ ఆర్‌కు ఇది బంప‌ర్ ఛాన్స్‌గా చెప్పాలి.

ఇక ఏపీ ప్ర‌భుత్వం ముందే హీరోలు, ద‌ర్శ‌కుల రెమ్యున‌రేష‌న్లు కాకుండా.. ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ రు. 100 కోట్ల బ‌డ్జెట్ దాటిన సినిమాల‌కు టిక్కెట్ రేట్లు పెంచుకునే వెలుసుబాటు ఇస్తామ‌ని ముందే ప్ర‌క‌టించింది. ఆ అనుమ‌తులే ఇప్పుడు త్రిబుల్ ఆర్‌కు వ‌ర్తించాయి. ఇక ఐదో షో కూడా ఉండ‌డంతో రాజ‌మౌళి.. త‌మ సినిమాకు ప్ర‌తి రోజు బెనిఫిట్ షో ఉంద‌ని సంతోషంగా చెపుతున్నారు.

ఇక తెలంగాణ‌లో ఇప్ప‌టికే టిక్కెట్ రేట్లు కావాల్సిన కాడ‌కు పెంచేసుకున్నారు. పైగా ప్ర‌భుత్వం అస‌లు అనుమ‌తులే లేకుండా ఐదో షోకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది. అయితే ఆ షో ఉద‌యం 8 గంట‌ల నుంచి రాత్రి 1 గంట లోపు మాత్ర‌మే వేసుకోవాల‌న్న కండీష‌న్ పెట్టింది. అయితే ఇది పెద్ద స‌మ‌స్య కాదు. ఈ మాత్రం ప‌ర్మిష‌న్ వ‌స్తే మ‌నోళ్లు ఐదు షోలు మాత్ర‌మే కాదు.. ఆరో షో వేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

ఇక ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు రెండు కూడా త్రిబుల్ ఆర్‌కు ఈ రేంజ్‌లో కోప‌రేట్ చేస్తోన్న నేప‌థ్యంలో మార్చి 24న సాయంత్రం లేదా సెకండ్ షో నుంచి ఫెయిడ్ ప్రీమియ‌ర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అయినా కూడా టిక్కెట్లు దొరుకుతాయ‌న్న గ్యారెంటీ అయితే లేదు. త్రిబుల్ ఆర్ టిక్కెట్ల కోసం ఇప్ప‌టి నుంచే భారీ ఎత్తున లాబీయింగ్ న‌డుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news