Moviesఆ హీరోయిన్‌ను టాలీవుడ్‌లో తొక్కేస్తోందెవ‌రు... తెర‌వెన‌క ఇంత పెద్ద మాఫియానా ?

ఆ హీరోయిన్‌ను టాలీవుడ్‌లో తొక్కేస్తోందెవ‌రు… తెర‌వెన‌క ఇంత పెద్ద మాఫియానా ?

ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల‌కు ఛాన్సులు రావ‌డం అనేదాని వెన‌క చాలా క‌థ‌లే న‌డుస్తూ ఉంటాయి. కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్న‌ప్పుడు ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా కాస్త వంచాల్సిందే. ఈ ప‌దానికి చాలా అర్థాలు ఉంటాయి. వంగి ఉండాలి.. త‌గ్గి ఉండాలి.. ఇంకేదో.. ఏవేవో చేయాలి. రెండు హిట్లు ప‌డి.. జనాల్లో క్రేజ్ వ‌స్తే ఇక ఎవ్వ‌రూ త‌గ్గ‌రు. డిమాండ్ ఉన్న‌ప్పుడు హీరోలు, ద‌ర్శ‌కులే హీరోయిన్ల వెంట ప‌డుతూ ఉంటారు. ఆమెకు మార్కెట్ ఉంది.. త‌మ సినిమాకు రేంజ్ పెరుగుతుంది అనుకుంటే ఎవ్వ‌రూ మాత్రం వ‌దులుకోరు.

ఇక కొంద‌రు హీరోయిన్ల‌ను మీ సినిమాల్లో హీరోయిన్‌గా పెట్టుకోవాల‌ని పెద్ద‌ల నుంచి ఫోన్లు వ‌స్తూ ఉంటాయి. హీరోయిన్ల‌తో పెద్దోళ్ల‌కు ఉన్న లింకుల నేప‌థ్యంలో ఈ రిక‌మెండేష‌న్లు మామూలే. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ విష‌యంలో పూర్తి రివ‌ర్స్ జ‌రుగుతోంది. ఆమెకు సినిమాల్లో ఛాన్సులు రావ‌డ‌మే ఆల‌స్యం. పెద్దోళ్ల నుంచి ఆ సినిమా ద‌ర్శ‌కుడికో.. మేక‌ర్స్‌కు ఫోన్లు వ‌చ్చేస్తున్నాయ్‌.. మీరేం చేస్తారో మాకు తెలియ‌దు.. ఆమెను సినిమా నుంచి త‌ప్పించేయ‌మ‌ని బ‌లంగా చెపుతున్నార‌ట‌.

ఇక ఆ హీరోయిన్ విష‌యంలోకి వెళితే.. ఆమె ప‌ర‌భాషా హీరోయిన్‌. ఆమెకు తెలుగులో కూడా మంచి ఛాన్సులే వ‌చ్చాయి.. వ‌స్తున్నాయి కూడా..! అయితే ఈమెకు ఛాన్సులు తెలుగులో వ‌స్తున్న‌ట్టే వ‌స్తున్నాయి. ఇంత‌లోనే పోతున్నాయి. సారీ మీకు ఛాన్స్ లేదు అని వెంట‌నే ఫోన్లు వెళ్లిపోతున్నాయి. అదేంటి అని ఆమె అడిగితే నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఏవేవో కార‌ణాలు చెపుతారు. అయితే ఆమెకు ఛాన్సులు వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి ఎందుకు పోతున్నాయి.. అంటే ఆ క‌థ వేరే ఉంద‌ని ఇప్పుడు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఆ అమ్మాయికి క‌ర్నాట‌క‌లో చాలా పెద్దోళ్ల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజ‌కీయ నాయ‌కుల‌తో మొద‌లు పెట్టి ఇండ‌స్ట్రీలో, పారిశ్రామిక వేత్త‌ల‌తో బ‌డా బ‌డా వాళ్ల‌తోనే చాలా గ‌ట్టి సంబంధాలే ఉన్నాయ‌ట‌. ఈ సంబంధాలు ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె ఇప్పుడు హైద‌రాబాద్‌లో సినిమా కోసం ఆరేడు నెల‌లు మ‌కాం వేస్తే.. వాళ్ల స‌ర‌దాలు, సంగ‌తులు కుద‌ర‌వు. అందుకే ఆమె ఇక్క‌డ వాలిపోవ‌డం ఆల‌స్యం.. నిఘా మొద‌లైపోతోంద‌ట‌. ఆమె ఇక్క‌డ ఎవ‌రెవ‌రిని క‌లుస్తోంది.. అన్న వివ‌రాల‌తో క‌ర్నాట‌క‌కు ఫోన్లు వెళ్లిపోతాయి.

అంతే వాళ్లు ఆ సినిమా ద‌ర్శ‌కుల‌కో లేదా నిర్మాత‌కో ఫోన్ చేస్తారు.. ఛాన్స్ మాత్రం క్యాన్సిల్ చేయాల్సిందే అంటారు. వెంట‌నే ఆమెను త‌ప్పించేస్తారు. ఇప్ప‌టికే ఆమెకు చేజారిన అవ‌కాశాలే కాదు.. తాజాగా ఓ మెగా ఛాన్స్ వ‌చ్చింది. వెంట‌నే అది చేజారిపోయింది. అస‌లు క‌థేంట‌ని ఆరాతీస్తే ఇండ‌స్ట్రీలో ఈ క‌థంతా బ‌య‌ట‌కు వ‌చ్చింది. పాపం ఆమెను త‌ప్పించేసి ఆ ప్లేసులో మ‌రో హీరోయిన్‌ను వెంట‌నే తీసేసుకున్నారు. అది ఆ హీరోయిన్ క‌థ‌..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news