Moviesపోకిరి - బిజినెస్‌మేన్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హీరోలు పూరి - మ‌హేష్‌కు...

పోకిరి – బిజినెస్‌మేన్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హీరోలు పూరి – మ‌హేష్‌కు ఎక్క‌డ చెడింది.. ఆ గొడ‌వేంటి..!

పూరి జ‌గ‌న్నాథ్ టాలీవుడ్ డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్‌. ఎంత పెద్ద హీరోతో అయినా చ‌క‌చ‌కా రెండు నుంచి మూడు నెల‌ల్లో తీసి అవ‌త‌ల ప‌డేస్తాడు. అలాంటి పూరి తెలుగులో దాదాపు అంద‌రు స్టార్ హీరోల‌తో సినిమాలు తీశాడు. పూరి – మ‌హేష్‌బాబుది సూప‌ర్ కాంబినేష‌న్‌. మ‌హేష్‌ను పోకిరి సినిమాతో తీసుకువెళ్లి ఎక్క‌డో కూర్చోపెట్టేశాడు. అప్ప‌టి వ‌ర‌కు తెలుగులో ఉన్న ఎన్నో రికార్డుల‌కు పోకిరి పాత‌రేసేసింది. అస‌లు యూత్ మ‌హేష్ స్టైల్‌, మేన‌రిజ‌మ్‌కు ఫిదా అయిపోయారు. చాలా థియేట‌ర్ల‌లో 175 రోజులు, 200 రోజులు ఆడిన పోకిరి వ‌సూళ్లు కుమ్మేసింది.

ఆ సినిమా త‌ర్వాత మ‌హేష్ చాలా రోజులు వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. త‌ర్వాత వ‌రుస ప్లాపుల్లో ఉన్న మ‌హేష్‌కు దూకుడు మంచి హిట్ ఇచ్చింది. ఆ వెంట‌నే నాలుగు నెల‌ల గ్యాప్‌లో బిజినెస్‌మేన్ సినిమాతో మ‌రో సూప‌ర్ హిట్‌. నిజంగా బిజినెస్‌మేన్ సినిమాతో మ‌రోసారి మ‌హేష్‌ను స్టైల్ ప‌రంగా బాగా మెస్మ‌రైజ్ చేసిన ఘ‌న‌త పూరీకే ద‌క్కుతుంది. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి కూడా ఎన్నోసార్లు ఓపెన్‌గా చెప్పాడు.

ఆ త‌ర్వాత జ‌న‌గ‌న‌మ‌ణ అనే టైటిల్‌తో దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో ఓ క‌థ రెడీ చేసుకున్నాడు పూరి. అప్పుడు పూరికి అంతా బ్యాడ్ టైం న‌డుస్తోంది. ఆరు వ‌రుస ప్లాపులు.. అందులో బాల‌య్య పైసా వ‌సూల్ కూడా ఉంది. అస‌లు పూరిని ఎవ్వ‌రూ ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌డం లేదు. టెంప‌ర్ త‌ర్వాత పూరిది అంతా బ్యాడ్ టైం. ఇస్మార్ట్ శంక‌ర్ వ‌ర‌కు పూరికి అన్ని ప్లాపులే..!

ఆ టైంలో వెళ్లి మ‌హేష్‌కు క‌థ చెప్పాడు.. మొహ‌మాటానికో ఎందుకో కాని మ‌హేష్ చేద్దాం అన‌లేదు కాని.. చూద్దాం అన్నాడు. అయితే ఎప్ప‌ట‌కీ పూరికి పిలుపు రావ‌డం లేదు. రెండు , మూడు సార్లు క‌లిశాడు. రిప్లే లేదు… మ‌హేష్ మాత్రం ఇత‌ర ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. అయితే మ‌హేష్‌కు ఆ టైంలో పూరితో సినిమా చేస్తే పెద్ద డిజాస్ట‌ర్ అని ఫిక్సైపోయిన‌ట్టున్నాడు.. అందుకే అస్స‌లు పూరి ఎన్నిసార్లు వ‌స్తున్నా ప‌ట్టించుకోలేదు.

పూరి ఇగో హ‌ర్ట్ అయ్యింది. వెంట‌నే మాట అనేశాడు. మ‌హేష్‌కు హిట్ల‌లో ఉన్న‌ప్పుడే మ‌నం గుర్తుకు వ‌స్తాం.. ప్లాపుల్లో ఉంటే మ‌న‌ల‌ను ప‌ట్టించుకోడ‌ని చెప్పేశాడు. మ‌హేష్ కూడా హ‌ర్ట్ అయ్యాడు. దీనిపై ఇండ‌స్ట్రీలో పెద్ద చ‌ర్చే న‌డిచింది. త‌ర్వాత ఇద్ద‌రూ క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయినా మ‌హేష్ పూరికి ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఇప్ప‌ట్లో ఇస్తాడ‌న్న న‌మ్మ‌కాలు పూరికి లేవు. ఇస్మార్ట్ శంక‌ర్ హిట్‌… ఇప్పుడు లైగ‌ర్ ఏం చేస్తుంద‌నే దానిమీదే పూరి ఫ్యూచ‌ర్ ఉంటుంది.

ఇక ఆ మ‌హేష్ కోసం రాసుకున్న జ‌న‌గ‌ణ‌మ‌న ( జేజీఎం)ను ఈ రోజు ప‌ట్టాలు ఎక్కించేశాడు. వచ్చే ఏడాది ఆగస్టు 3న విడుదల. అది కూడా ఇప్పుడే ప్రకటించారు. దేశ‌భ‌క్తి, ఆర్మీ నేప‌థ్యంలో సినిమా క‌థ ఉంటుంద‌ని చెప్పేశారు. ఇక పాన్ ఇండియా లెవ‌ల్లో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news