Moviesబాబాయిని వద్దన్న బ్యూటీ తో అబ్బాయి రొమాన్స్..ఆలోచించుకో బ్రదర్..?

బాబాయిని వద్దన్న బ్యూటీ తో అబ్బాయి రొమాన్స్..ఆలోచించుకో బ్రదర్..?

సినీ ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కధను మరోక హీరో తో తెరకెక్కించడం చాలా కామన్. ఇలాంటివి ఇప్పటికే చాలా చూశాం. బడా బడా స్టార్స్ సైతం డేట్లు అడ్జేస్ట్ చేయలేక మంచి సినిమాలు వదులుకోవడం..ఆ కధలు పక్క హీరోలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం అంత మన కళ్ల ముందే జరిగిపోతాయి. అలానే .. కొందరు హీరోలు తమ సినిమాలో ఏ హీరోయిన్ అయితే బాగుంటుందో కధకు అనుగుణంగా తమ పక్కన జోడీగా సెట్ అవుతుందో డైరెక్టర్స్ కి సజిస్ట్ చేస్తుంటారు. అలాంటి వారిలో మెగా ప్రీన్స్ వరుణ్ తేజ కూడా ఒకరు.

చేసే ప్రతి సినిమాకి ఏదో ఒక్క ఢిఫరెంట్ యాంగిల్ బయట పెడుతూ.. మెగా అభిమానులను మెప్పిస్తున్నాడు ఈ కుర్ర హీరో . మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూ.ఇండస్ట్రీలో తనదైన మార్క్ తో దూసుకుపోతున్నాడు ప్రస్తుతం ‘గని, ఎఫ్3’ మూవీస్‌తో బిజీగా ఉన్న వరుణ్..ఆ సినిమాలో లైన్లో ఉండగానే మరో ప్రాజెక్ట్ ను ఓకే చేసిన్నట్లు తెలుస్తుంది.

అప్పుడెప్పుడో F2 కంటే ముందే వరుణ్ ..సాగర్ సంద్ర డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు అంటూ క్రేజీ వార్త తెగ హల్ చల్ చేసింది. రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చేస్తుంది అని తెగ హడావుడి చేశారు. కానీ ఇప్పటివరకు అప్డేట్ లేదు. ఇక రీసెంట్ గా భీంలా నాయక్ హిట్ అయిన తరువాత..ఆ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి ని పెట్టే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇది వరకే వీళ్ళు “ఫిదా” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక కధ పరంగా చూసుకున్నా పల్లవికి బాగా మ్యాచ్ అవుతుంది..పైగా ఎక్స్ పోజింగ్ చేసే క్యారెక్టర్ కాదు.

అందులో ఇప్పుడు సాయిపల్లవికి ఫుల్ డిమాంద్ ఉంది. మొన్న ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అయితే స్టార్ హీరోకి కూడా అందుకోని అభిమానాని అందుకుంది. ఇక తనే ఈ సినిమాకి కరెక్ట్ అనుకుంటున్నారట. ఈ విషయంలో వరుణ్ కూడా ఓకే చెప్పాడట. కానీ, భీంలా నాయక్ సినిమాలో అవకాశం వస్తే సాయిపల్లవి రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ నెక్స్ట్ మూవీ కే వెళ్ళి మా సినిమాలో చేయ్యండి అని అడిగితే ఒప్పుకుంటుందా..? పైగా సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీ గా ఉంది.. అడిగి కాదు అనిపించుకుంటావా..? ఆలోచించుకో బ్రదర్ అంటూ నెటిజన్స్ సాగర్ కు సజీషన్స్ ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news