Moviesబాల‌య్య కోసం పోటీ ప‌డుతోన్న ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు... మ‌ధ్య‌లో న‌లుగుతున్న స్టార్...

బాల‌య్య కోసం పోటీ ప‌డుతోన్న ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు… మ‌ధ్య‌లో న‌లుగుతున్న స్టార్ ప్రొడ్యుస‌ర్‌…!

బాల‌య్య అఖండ గ‌ర్జ‌న ఆగ‌డం లేదు. అఖండ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యి శ‌త‌దినోత్స‌వం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసింది. మ‌లినేని గోపీచంద్ సినిమా షూటింగ్ న‌డుస్తోంది. కొద్ది రోజుల్లో ఫ‌స్ట్ షెడ్యూల్ కూడా ఫినిష్ చేస్తారు. ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమా ఉంది. నెక్ట్స్ చాలా మంది డైరెక్ట‌ర్లు బాల‌య్య కోసం క్యూలో ఉన్నారు. ఎలాగైనా బాల‌య్య‌తో సినిమా చేయాల‌ని.. అది కూడా 2024 ఎన్నిక‌ల‌కు ముందే చేయాల‌ని పోటీ ప‌డుతోన్న వారు చాలా మందే ఉన్నారు.

ఇటు 2024 ఎన్నిక‌ల‌కు ముందే బాల‌య్య‌తో సినిమా చేయాల‌ని పంతం ప‌ట్టుకుని ఉన్న నిర్మాత‌ల లిస్ట్ కూడా ఎక్కువే. ఇక తాజాగా డీజే టిల్లు, భీమ్లానాయ‌క్ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల‌తో ఫామ్‌లో ఉన్న సితారా ఎంట‌ర్టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ బాల‌య్య‌తో ఓ సినిమా చేయాలి. బాల‌య్య కూడా ఆ బ్యాన‌ర్‌కు ఎప్పుడో ఓకే చెప్పాడు. అయితే క‌థ‌, ద‌ర్శ‌కుడు సెట్ కాక ఇప్ప‌టి వ‌ర‌కు వాయిదా పడుతూ వ‌చ్చింది. నిర్మాత నాగ‌వంశీ ఇప్పుడు ఎలాగైనా మ‌లినేని గోపీచంద్ సినిమా అయిన వెంట‌నే.. కుద‌ర‌క‌పోతే క‌నీసం అనిల్ రావిపూడి సినిమా అయిన వెంట‌నే అయినా బాల‌య్య‌తో సినిమా చేసేయాల‌ని కంగారుగా ఉన్నాడు.

సితార అర్జెంటుగా బాల‌య్య కోసం సెట్ అయ్యే క‌థ కోసం గ‌ట్టిగా అన్వేషిస్తోంది. ఈ విష‌యం తెలిసిన కొంద‌రు ద‌ర్శ‌కులు కూడా ఈ బ్యాన‌ర్ వెంట ప‌డుతున్నారు. ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది సితారా వాళ్ల‌కు ఓ క‌థ చెప్పాడు. ఇదే క‌థ బాల‌య్య కూడా కొంత వ‌ర‌కు విన్నాడు. ఆల్మోస్ట్ ఈ క‌థ ఓకే అని.. సంప‌త్ నంది బాల‌య్య సినిమాకు ద‌ర్శ‌కుడిగా ఫిక్స్ అవుతాడ‌నే ప్ర‌చారం గ‌ట్టిగా న‌డిచింది. ఇంత‌లో ఏమైందో గాని.. ఇప్పుడు ద‌ర్శ‌కుడు కేఎస్‌. ర‌వీంద్ర (బాబి) కూడా సితార వాళ్ల‌కు ఓ క‌థ చెప్ప‌డం.. అది ఇంకా బాగుంద‌న్న నిర్ణ‌యానికి రావ‌డంతో క‌న్‌ఫ్యూజ్ నెల‌కొంది.

అయితే బాబి ముందుగా చిరంజీవితో సినిమా కంప్లీట్ చేయాలి. ఈ లోగా బాల‌య్య కూడా గోపీచంద్‌, అనిల్ రావిపూడి సినిమాలు చేసేయొచ్చు. ఇక రెండు క‌థ‌లు సితార‌కు న‌చ్చిన‌ట్టుగా ఉండ‌డంతో రెండు క‌థ‌లు బాల‌య్య ముందు పెట్టాల‌ని.. ఏ క‌థ ఆయ‌న‌కు న‌చ్చితే ఆ క‌థ‌తోనే ముందుకు వెళ్లాల‌ని బేసిక్ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

స‌రే ఇంకో ఇంట‌ర్న‌ల్ టాక్ ప్ర‌కారం ఇద్ద‌రు ద‌ర్శ‌కులు బాల‌య్య కోసం పోటీ ప‌డుతున్నా సంప‌త్ నంది క‌థ కాస్త మాస్‌ను ఎట్రాక్ట్ చేసేదిగా ఉంద‌ని.. బాల‌య్య‌కు యాఫ్ట్ అవుతుంద‌ని.. అటు సంప‌త్ నంది మాస్‌ను బాగా డీల్ చేస్తాడు.. బాల‌య్యకు ఆ క‌థే న‌చ్చుతుంద‌ని కూడా అంటున్నారు. మ‌రి బాల‌య్య ఫైన‌ల్‌గా ఎవ‌రికి ఓటేస్తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news