Moviesటాలీవుడ్ బిగ్ ట్విస్ట్‌... ఆ యంగ్ హీరో ప్రేమ‌లో స‌మంత‌..!

టాలీవుడ్ బిగ్ ట్విస్ట్‌… ఆ యంగ్ హీరో ప్రేమ‌లో స‌మంత‌..!

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌తో విడాకులు అయిపోయిన తరువాత హీరోయిన్ సమంత ఫుల్ స్పీడ్ లో వుంది. వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోంది. అటు హాట్‌గా క‌నిపించేందుకు కూడా ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. అటు శాకుంతలం..ఇటు యశోద లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మంచి ఆఫర్ల కోసం చూస్తోంది. ఓవైపు బాలీవుడ్‌లో హాట్ వెబ్ సీరిస్‌ల‌లో క‌నిపించేందుకు రెడీ అవుతోంది. ఇటు కోలీవుడ్‌లో యంగ్ హీరో కార్తీతో ఓ సినిమాకు ఓకే చెప్పింది.

ఇక హాలీవుడ్ నుంచి కూడా స‌మంత‌కు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఓ హాలీవుడ్ సినిమాలో న‌టించేందుకు స‌మంత‌పై ఫొటో షూట్ కూడా న‌డిచింది. ఇక ఇప్పుడు తెలుగులో అదిరిపోయే ఆఫ‌ర్ స‌మంత సొంతం అయిన‌ట్టు తెలుస్తోంది.యూత్‌లో మాంచి కిక్‌, క్రేజ్ ఉన్న రౌడీ హీరో విజ‌య్ దేవర కొండ సరసన హీరోయిన్ గా చేయబోతోంది.

శివనిర్వాణతో హీరో విజ‌య్ సినిమా ఎప్పుడు ఉంటుందో ? లేదో తెలియ‌డం లేదు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ న‌టిస్తోన్న పాన్ ఇండియా మూవీ లైగ‌ర్ దాదాపు షూటింగ్ పూర్త‌య్యింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి పూరి – విజ‌య్ జ‌న‌గ‌న‌మ‌ణ సినిమా ప‌ట్టాలు ఎక్కించేయ‌నున్నారు. ఈ సినిమా లొకేష‌న్ల వేట కోసం కాస్త టైం ప‌ట్టేలా ఉంది. ఈ లోగా విజ‌య్ ఓ సినిమా చేసేయాల‌ని డిసైడ్ అయిపోయాడు.

ఇది పూర్తి ప్రేమ‌క‌థ‌గా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం కియారా అద్వానీతో పాటు ఒక‌రిద్ద‌రు స్టార్ హీరోయిన్ల పేర్లు ప‌రిశీలించారు. చివ‌ర‌కు అటూ ఇటూ తిరిగి స‌మంత ద‌గ్గర ఆగినట్టు తెలుస్తోంది. కంప్లీట్ ప్రేమ నేప‌థ్యంలో తెర‌కెక్కే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి. ఇది త్వ‌ర‌గా ఫినిష్ చేసిన వెంట‌నే పూరి జ‌న‌గ‌న‌మ‌ణ స్టార్ట్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news