Moviesచుక్క‌ల్లో ప‌వ‌న్ కొత్త రెమ్యున‌రేష‌న్‌... నిర్మాత డేరింగ్ మెచ్చుకోవాల్సిందే..!

చుక్క‌ల్లో ప‌వ‌న్ కొత్త రెమ్యున‌రేష‌న్‌… నిర్మాత డేరింగ్ మెచ్చుకోవాల్సిందే..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇటీవ‌ల కాలంలో ఆయ‌న రేంజ్‌కు త‌గిన హిట్లు అయితే రాలేదు. అప్పుడెప్పుడో 2013లో వ‌చ్చిన అత్తారింటికి దారేది లాంటి సూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత ప‌వ‌న్‌కు ఆ రేంజ్ హిట్ అయితే ప‌డ‌లేదు. వ‌కీల్‌సాబ్ సినిమా రీమేక్‌.. జ‌స్ట్ యావ‌రేజ్‌. భీమ్లానాయ‌క్ కూడా జ‌స్ట్ యావ‌రేజ్ .. మ‌రీ అత్తారింటికి దారేది లాంటి హిట్ కాదు.. ఇండ‌స్ట్రీ హిట్ అయితే కాదు. అయితే ప‌వ‌న్ సినిమాల హిట్లు. ప్లాపుల‌తో సంబంధం లేకుండా ప‌వ‌న్‌కు క్రేజ్ అలాగే ఉంటుంది.. రెమ్యున‌రేష‌న్ కూడా అలాగే ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు భీమ్లానాయ‌క్ విష‌యానికి వ‌స్తే ఎబో యావ‌రేజ్ / హిట్ టాక్ అయితే ఉంది. ఈ సినిమా ఫుల్ ర‌న్‌లో ఆంధ్రాలో రు. 30, సీడెడ్లో రు. 15 కోట్లు క‌లెక్ట్ చేయ‌వ‌చ్చేమో అంటున్నారు. అది కూడా చూడాలి. ఇక నైజాంలో ప్ర‌భుత్వం ఫుల్ స‌పోర్ట్ ఉంది. అక్క‌డ రు. 36 కోట్లు వ‌స్తే సినిమా గ‌ట్టెక్కేసిన‌ట్టే..! ఈ వ‌సూళ్ల లెక్క‌లు ఇలా ఉంటే ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ రు. 50 కోట్లు అని టాక్ ?

రు. 50 కోట్లు ఇచ్చి కానీ ప‌వ‌న్ డేట్లు లాక్ చేయ‌లేక‌పోయాడ‌ట నిర్మాత‌. అయితే ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. పీపుల్స్ మీడియా ప‌వ‌న్ హీరోగా ఓ సినిమా రీమేక్ చేస్తోంది. దాదాపు దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాకు ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ రు. 50 కోట్ల‌తో పాటు లాభాల్లో వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరింద‌ట‌. అస‌లు ఏ ధైర్యంతో పీపుల్స్ మీడియా వాళ్లు ఇంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చి ప‌వ‌న్ డేట్లు లాక్ చేశారో అర్థం కావ‌డం లేదు. వాళ్ల గ‌ట్స్‌ను మెచ్చుకోవాల్సిందే అని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ న‌డుస్తోంది.

ప‌వ‌న్‌కు రెమ్యున‌రేష‌న్ రు. 50 కోట్లు + లాభాల్లో వాటా, క‌థ‌, మాట‌లు ఇచ్చే త్రివిక్ర‌మ్‌కు రు. 10 కోట్లు, సాయిధ‌ర‌మ్ తేజ్‌కు రు. 8 కోట్లు అంట‌. అంటే ఇక్క‌డికే రు. 68 కోట్లు అయిపోయాయి. ఇక డైరెక్ట‌ర్‌, హీరోయిన్‌, ప్రొడ‌క్ష‌న్ కాస్ట్‌, టెక్నీషియ‌న్ల రెమ్యున‌రేష‌న్ ఇవ‌న్నీ క‌లుపుకుంటే అస‌లు ఇంత అవుతుందో ? లెక్క క‌ట్ట‌లేం. పైగా సినిమాలో భాగ‌స్వామి అయిన జీ టీవీ వాటా, ప‌వ‌న్ వాటా పోను ఇక నిర్మాత‌కు ఎంత మిగులుతుంది ? అస‌లు ఈ డేరింగ్ ఏంటో అర్థం కావ‌డం లేదు. అదంతా ప‌వ‌న్ మాయ అంతే అనుకోవాలేమో..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news