Moviesఅనుష్క సంచలన నిర్ణయం..ఆ సంస్ధ తో సినిమాలు బంద్..?

అనుష్క సంచలన నిర్ణయం..ఆ సంస్ధ తో సినిమాలు బంద్..?

టాలీవుడ్ జేజమ్మ ..అనుష్క శెట్టి గురిచి ఎంత చెప్పినా తక్కువే. అందానికి అందం..నటనకి నటన్..రెండింటిలోను క్వీన్ అనే చెప్పవచ్చు. ఒక్కప్పుడు వరుస ఆఫర్లతో బిజీ బిజీ గా గడిపిన అనుష్క ..ఎందుకో కొంత కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటుంది. రీజన్స్ తెలియవు కాని నిశబ్ధం సినిమా తరువాత నుండి ఆమె కొత్త సినిమా ఆఫర్లు వస్తున్న కూడా సైన్ చేయలేదు.

కాగా రీసెంట్ గానే ముదురు ముద్దుగుమ్మ‌.. స్వీటీబ్యూటీ అనుష్క నవీన్ పోలిశెట్టి సినిమా కు ఓకే చెప్పి షాక్ ఇచ్చింది. ఇప్పుడు అంతా తెలుగుతో పాటు సౌత్‌లో కుర్ర హీరోయిన్లు ర‌ష్మిక‌, పూజ‌, కీర్తి సురేష్ లాంటి వాళ్ల హంగామానే న‌డుస్తోంది. వీళ్ల పోటీ దెబ్బ‌తో అనుష్క‌కు అవ‌కాశాలు త‌గ్గాయని అంతా అనుకుంటున్న టైంలో ..తన సత్తా చాటడానికి మళ్ళి ఇ తెర పైకి అనుష్క ఫేస్‌ కనిపించనుంది. దీంతో అనుష్క ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతుండగా..మరో కొత్త బాంబ్ పేల్చింది ఈ స్వీటి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఒ బడా సంసధ అనుష్క తో సినిమా చేయడానికి భారీ ఆఫర్ ఇస్తూ ఆమెను అప్రోచ్ అయ్యారట. అయితే, అమ్మడు ప్రస్తుతం తీసుకుంటున్న దానికి డబుల్ రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినా కూడా అనుష్క నో చెప్పిందట. ఇక పై తాను వేరే ఇత‌ర నిర్మాత‌ల‌తో కానీ, వేరే బ్యానర్ లో కానీ సినిమా చేయ‌డానికి రెడీగా లేనని చెప్పిన‌ట్టు టాక్ వినిపిస్తుంది. ఇక పై ఆమె ఏ సినిమా చేసినా అది యూవీ క్రియేష‌న్స్ సంస్థ తోనే చేస్తుందట. ఎందుకంటే అనుష్క అభిరుచులకు తగ్గట్లు వాళ్లు ఉంటారట. త‌న‌ను ఓ హీరోలా ట్రీట్ చేస్తుంద‌ని చెప్పుకొచ్చిందట స్వీటీ. మరి చూడాలి అనుష్క తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాబోయే కాలంలో ఎలాంటి ప్లాబ్లమ్‌స్ ఎదురుకోబోతుందో..?

Latest news