MoviesRRR బ్లాక్‌బ‌స్ట‌ర్ ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి - ఉపాస‌న ఫుల్ ఎంజాయ్ (...

RRR బ్లాక్‌బ‌స్ట‌ర్ ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి – ఉపాస‌న ఫుల్ ఎంజాయ్ ( ఫోటో)

టాలీవుడ్‌లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రి కుటుంబాల‌కు ఇది డ‌బుల్ సెల్రేష‌న్స్ టైం అని చెప్పాలి. ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన త్రిబుల్ ఆర్ సినిమాకు బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ వ‌చ్చేసింది. తొలి రోజే ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 250 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింద‌ని చెపుతున్నారు. ఒక్క అమెరికాలోనే ఏకంగా రు. 50 కోట్లు తొలి రోజు రాబ‌ట్టింది అంటేనే త్రిబుల్ ఆర్ మానియా ఏ రేంజ్‌లో ఉందో అర్థ‌మ‌వుతోంది.

ఇక చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఇద్ద‌రూ కూడా త‌మ మూడేళ్ల క‌ష్టానికి ఈ రోజు ఈ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ రెండు కుటుంబాల‌కు ఇప్పుడు డ‌బుల్ ధ‌మాకా అని చెప్పాలి. ఇటు త్రిబుల్ ఆర్ విజ‌యం మాత్ర‌మే కాదు.. అటు ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి పుట్టిన రోజు.. అటు రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు. ఇలా ఈ రెండు కుటుంబాలు ఆర్ ఆర్ సెల‌బ్రేష‌న్స్‌తో పాటు ఈ బ‌ర్త్ డే సెలబ్రేష‌న్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి పుట్టిన రోజు సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న త‌మ సెల‌బ్రేష‌న్స్ నుంచి కొన్ని ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేశారు. ఉపాసనకు డబుల్ ధమాకా శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఒకేసారి ఇద్ద‌రు ఇళ్ల‌ల్లో పుట్టిన రోజు వేడుక‌ల‌తో పాటు అటు త్రిబుల్ ఆర్ స‌క్సెస్‌.. ఇలా ఢ‌బుల్ ధ‌మాకా రావ‌డంతో ఉపాస‌న‌, ప్ర‌ణీత ఎంజాయ్ అయితే మామూలుగా లేదు. ఉపాస‌న ప్ర‌ణ‌తికి బ‌ర్త్ డే విషెస్ చెపుతూ ఆమెతో ఉన్న ఫొటో షేర్ చేఇంది.

ప్రియ‌మైన ప్ర‌ణ‌తి నంద‌మూరి… బిగ్ ggggggg పుట్టినరోజుకు శుభాకాంక్షలు అని రాసుకువ‌చ్చింది. ఇటీవ‌లే ఎన్టీఆర్ మీ భార్య‌కు పుట్టిన రోజు గిఫ్ట్ ఏం ఇస్తార‌ని చెప్పిన‌దానికి RRR ఘనవిజయం అని చెప్పాడు. ఇప్పుడు ఎన్టీఆర్ త‌న వాగ్దానం నెర‌వేర్చిన‌ట్టు అయ్యింది. ఇక అటు ఉపాస‌స‌, ఇటు ప్ర‌ణ‌తి ఇద్ద‌రూ కూడా ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో ఈ సినిమా చూసేశారు. ఉపాస‌న త‌న ఫ్యామిలీతో క‌లిసి భ్ర‌మ‌రాంభ‌లో సినిమా చూసి త‌న భ‌ర్త చ‌ర‌ణ్‌పై కాగితాలు ఇసురుతూ నానా ర‌చ్చ చేసింది.

అటు ప్ర‌ణ‌తి త‌న కుటుంబంతో క‌లిసి మ‌హేష్‌బాబు ఏఎంబీ సినిమాస్‌లో సినిమా చూసి ఎంజాయ్ చేసింది. ఏదేమైనా ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల భార్య‌లు ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ జోష్‌లో ఉన్నారు. ఇక వీరిద్ద‌రు త‌మ ఫ్యామిలీ పార్టీల్లో త‌ర‌చుగానే క‌లుసుకుంటూ ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news