Moviesబడా డైరెక్టర్ సినిమాలో నేషనల్ క్రష్..రష్మిక కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ ఆఫర్..!!

బడా డైరెక్టర్ సినిమాలో నేషనల్ క్రష్..రష్మిక కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ ఆఫర్..!!

రష్మిక మందనా..ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ లో ఉన్న హీరోయిన్. కన్నడ నుండి వచ్చి సౌత్‌లో సెటిల్ అయ్యి.. ఇప్పుడు నార్త్‌ను ఏలేయడానికి సిద్ధమవుతోంది ఈ బ్యూటీ. టాలీవుడ్‌‌లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్ లలో రష్మిక మందన్న ఒకరు. ఛలో’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక.. మొదటి సినిమానే హిట్ కావడంతో ఆమెకి తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. అబ్బో..ఈ అమ్మడుకు ఉన్న క్రేజ్ గురించి.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ..బన్నీ, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది.

అందం, అభినయం ఉండడం కూడా రష్మికకు కలిసొస్తోంది. ఇక అమ్మడు లక్ కారణంగా వరుస సినిమాలకి కమిట్ అవుతూ..కమిట్ అయిన సినిమాలన్నీ హిట్స్ కొడుతూ.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.రెమ్యూనరేషన్ విషయంలొ కూడా కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే భారీ స్దాయిలో డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ భామ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పైగా ఇటీవల విడుదలయిన ‘పుష్ప’ తనకు పాన్ ఇండియా క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.

కాగా ప్రస్తూం అమ్మడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన్నత్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే రష్మిక కు ఓ ఆఫర్ వరించిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బడా స్టార్ హీరో రణబీర్ కపూర్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసిన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు సందీప్ వంగ తో రణబీర్ కపూర్ ఓ సినిమా చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. యానిమల్ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ను సెలక్ట్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పరిణీతి చోప్రాను అనుకున్నారు. ఆమె మీద కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. కానీ లాస్ట్ మూమెంట్ లో ఆమెను తొలగిస్తూ రష్మికను ఫైనల్ చేశారు సందీప్. రష్మికకు కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఛాన్స్ అనడంలో సందేహం లేదు. ఆమె చేతిలో ఉన్న హిందీ సినిమాలన్నీ విజయవంతం అయితే ఇండియాలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా రష్మిక నిలుస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news