Moviesబిగ్ షాకింగ్: కొంప ముంచిన అలియా కోపం..ఎన్టీఆర్ సినిమా నుండి ఔట్..?

బిగ్ షాకింగ్: కొంప ముంచిన అలియా కోపం..ఎన్టీఆర్ సినిమా నుండి ఔట్..?

మనకు తెలిసిందే గత రెండు రోజుల నుండి అలియా తెలుగు ఇండస్ట్రీ పై..ముఖ్యంగా టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి పై గుర్రుగా ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం లేకపోనూలేదు. రీసెంట్ గా ఆమె నటించిన RRR సినిమా లో ఆమె పాత్ర పై అసంతృప్తి గా ఉందట. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ రోల్ చాలా తక్కువని ముందే ఆమె కు చెప్పారట..కానీ ఆ పాత్ర నచ్చడంతో సినిమా కు ఒప్పుకుని..ఎంతో కష్టపడి సినిమా కోసం తెలుగు పదాలను మాట్లాడటం నేర్చుకున్నారట. సినిమా రిలీజ్ తరువాత తనకు మంచి పేరు వస్తుందని ఆశించిన అలియాకి నిరాశే ఎదురైంది.


ఎందుకంటే సినిమాలో ఆమె పట్టుమని పదినిమిషాలు కూడా కనిపించకపోవడంతో బాలీవుడ్ లో ని ఆమె అభిమానులు హర్ట్ అయ్యారట. ఆమె అభిమానులే కాదు సినిమా చూసిన జనాలకు అదే అనిపించింది. అలియా స్క్రీన్ టైం కొంచెం పెంచుంటే బాగుండేది అని. కానీ, నిజానికి ఈ సినిమాలో అలియావి చరణ్ తో కొన్ని సీన్స్ ఉన్నాయట, కానీ..సినిమా నిడివి ఎక్కువ అవుతుండటంతో అవి ఎడిట్ చేశారట. అది కూడా అలియా కి చెప్పకుండానే ఈ సినిమాలో ఆమె కు సంబంధించిన సీన్స్ తీసేయ్యడం పట్ల ఆమె కోపంగా ఉందని తెలుస్తుంది.

ఈ కోపం లోనే ఆమె రాజమౌళి ని ఇన్స్టా లో అన్ ఫాలో చేసిందని..RRR కు సంబంధించిన ఫోటోలనీ డిలిట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..అలియా మరో తెలుగు సినిమా నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. కొరటాల్ తారక్ డైరెక్షన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తైయ్యయి..అన్ని కరెక్ట్ గా ఉంటే మే నెలలో షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఎండలు ఎక్కువుగా ఉండటంతో తారక్ షూటింగ్ పోస్ట్ పోన్ చేశారట. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా ఫిక్స్ అయ్యిన్నట్లు టాక్ వినిపించింది.

అలియా కూడా ఓ ఇంటర్వ్యుల్లో ఈ తారక్ పక్కన నటిస్తున్నా అని కన్ ఫాం చేసింది. కానీ, రీసెంట్ గా జరిగిన ఇష్యూతో అలియా ఇక పై తెలుగులో సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యారట. అందుకే ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి దీని పై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news