Moviesఆ అర్హతలు తనకి ఉన్నాయ్..రాజమౌళి భజన మరీ ఎక్కువైందే..?

ఆ అర్హతలు తనకి ఉన్నాయ్..రాజమౌళి భజన మరీ ఎక్కువైందే..?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి మరి కొన్ని రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ రూపంలో భారీ విజయాని తన ఖాతాలో వేసుకునేందుకు రెడీగా ఉన్నాడు. ఓ పక్క తన చిత్ర ప్రమోషన్స్ పనుల్లో బిజీ గా ఉంటూనే మరోపక్క ఇతరుల సినిమా ఈవెంట్స్ కి హాజరవుతూ..పరోక్షంగా తన సినిమాకి మంచి పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. ఆ విషయంలో రాజమౌళిని మించిన ముదురు మరొకరుండరు అంటూ జనాల నుండి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి..అబ్బో ఈ పేరు కు చాలా పెద్ద చరిత్ర ఉంది. చెప్పుకుంటూ పోతే చెరిగిపోని లెక్కలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆయన గురించి కన్నా ఆయన తనయుడు కిరీటి గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. యస్..ప్రజెంట్ ఎక్కడ చూసిన..గాలి కిరీటి పేరు మారిమ్రోగిపోతుంది. సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా…కొత్త హీరోలు వస్తూనే ఉంటారు..తమ టాలెంట్ చూయిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు తన లోని నటనా టాలెంట్ ని మనకు చూయించడానికి వస్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు గాలి కిరీటి.

ఈయన సినిమా రంగ ప్రవేశం చేస్తున్నారు అన్న వార్తలు వచ్చాయే కానీ..పూర్తి డీటైల్స్ అయితే రివీల్ చేయలేదు. ఇక తాజాగా కీరిటి మూవికి సంబంధించిన వివరాలు రిలీజ్ చేశారు. కాగా నేడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం బెంగళూరులో వైభవంగా జరిగాయి. టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి క్లాప్ కొట్టి ఈ సినిమాకు స్టార్ట్ చేశారు. కిరీటి మొదటి చిత్రమే ద్విభాషా తెలుగు – కన్నడ చిత్రం గా తెరకెక్కుతుంది.

యువ ద‌ర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత‌ సాయి కొర్రపాటి వారాహి చలనచిత్రం బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా జెనీలియా కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర వి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

 

ఈ సందర్భంగా జెనీలియా రాజమౌళి–” కిరీటిని హీరోగా పరిచయం చేస్తూ టీజర్‌ను నేను విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇదివరకే చూశాను తన లుక్స్‌ చాలా బాగున్నాయి. హీరోకి చక్కగా సరిపోతాడు. అబ్బాయికి నటుడికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కిరీటిలో ఉన్న స్పెషల్ టాలెంట్ ని కూదా మీరు ఈ సినిమాలో చూడబోతున్నారు. నటన, డ్యాన్స్, ఫైట్స్‌ అన్నీ కిరీటి బాగా చేయగలడు. వారాహి బేనర్‌లో కిరీటి మొదటి సినిమా చేయడం ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news