Moviesఈ ఒక్క వీడియో చాలదా..‘రాధేశ్యామ్‌’ చరిత్ర సృష్టించబోతుంది అని చెప్పడానికి..హ్యాట్స్ ఆఫ్...

ఈ ఒక్క వీడియో చాలదా..‘రాధేశ్యామ్‌’ చరిత్ర సృష్టించబోతుంది అని చెప్పడానికి..హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్..!!

రాధేశ్యామ్‌ సినిమా కోసం యావత్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తోంది.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ‘రాధేశ్యామ్‌’ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సాహో తర్వాత ప్రభాస్‌ నటించిన మరో పాన్‌ ఇండియా చిత్రమే ‘రాధేశ్యామ్‌’. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా యూర‌ప్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. రెండు ద‌శాబ్దాల క్రితం యూర‌ప్‌లో జ‌రిగిన ఓ ప్రేమ‌కథ ఆధారంగానే ఈ సినిమా తెర‌కెక్కుతున్నట్లు ట్రైలర్ చూస్తూనే తెలిసిపోతుంది.

ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా..ఫనల్ గా మరో వారం రోజుల్లో ధియేటర్లల్లో సందది చేయదానికి వచ్చేస్తుంది. రాధేశ్యామ్‌ సినిమాను ఈ నెల 11 న రిలీజ్ చేయడాని చిత్ర బృందం రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ పనుల్లో బిజీ గా ఉంది. దీంతో ఎక్కడ చూసిన ప్రభాస్ పూజా పోస్టర్లతో ప్రచారాలతో హోరెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. 70ల కాలంనాటి స్టోరీ, రూ. వందల కోట్ల బడ్జెట్‌, దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌, దానికి తగ్గట్లు ప్రభాస్‌ హీరో గా .. దీంతో అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు.

కాగా రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించి మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ మేకింగ్ వీడియోలో నాలుగేళ్ల్లుగా మూవీ టీమ్ పడిన కష్టం, సినిమాని ఎంత బాగా చిత్రీకరించారో, ఎలా, ఎక్కడెక్కడ చిత్రీకరించారో చూపించారు. సగా ఆఫ్‌ రాధేశ్యామ్‌’ పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో మేకర్స్‌ 1970 కాలం నాటి ఇటలీని పున సృష్టించిన తీరు అద్భుతంగా ఉంది. ఇక కరోనా కారణంగా యూరప్‌లో షూటింగ్‌ ఆగిపోవడంతో.. ఇండియాలో యూరప్‌ సెట్‌ వేసి మరీ షూటింగ్‌ చేశారు.

ఇక మంచు ప్రాంతాల్లో షూటింగ్ కోసం హెలికాప్టర్‌ల వినియోగం, భారీ సెట్టింగ్స్‌ సినిమా నిర్మాణం కోసం ఎంతలా ఖర్చు చేశారో చెప్పకనే చెబుతోంది. రాధేశ్యామ్‌ కచ్చితంగా ప్రేక్షకులను మరో కొత్త లోకాలకు తీసుకెళుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈ మేకింగ్ వీడియో చూసి ప్రభాస్ కి అభిమానులు హ్యాట్స్ ఆఫ్ చెప్పుతున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలా విజయం సాధిస్తుందో..ఎన్ని రికార్డులను తిరగ రాస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news