Moviesబికినీ ఫొటో పంప‌వా అన్న అభిమాని.. దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన దిశాప‌టానీ..!

బికినీ ఫొటో పంప‌వా అన్న అభిమాని.. దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన దిశాప‌టానీ..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ మామూలు అమ్మాయి కాదు. ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌దు.. ఏ మాత్రం మొహ‌మాట ప‌డ‌దు. గ్లామ‌ర్ డోస్ పెంచ‌డంలోనూ .. అందాలు ఆర‌బోయ‌డంలో ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌దు. ఇంకా చెప్పాలంటే ఆమె అంత‌లా చూపిస్తుండ‌డంతోనే ఆమెకు ల‌క్ష‌ల్లో అభిమానులు ఉన్నారు. ఆమె సోష‌ల్ మీడియా ఖాతాల్లో కూడా హాట్‌గానే ద‌ర్శ‌న‌మిస్తూ ఉంటుంది. అందుకే ఆమె స్టిల్స్‌కు ల‌క్ష‌ల్లో లైకులు, వేల‌ల్లో కామెంట్లు కుమ్మ‌రిస్తూ ఉంటారు నెటిజ‌న్లు.

సోష‌ల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలే దేశ‌వ్యాప్తంగా ఆమెకు అన్ని భాష‌ల్లో అభిమానుల‌ను, ఫాలోవ‌ర్స్‌ను సొంతం చేశాయి. ఇక దిశా తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌యం ఉన్న అమ్మాయే. వ‌రుణ్ తేజ్ హీరోగా .. పూరి జ‌గన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన లోఫ‌ర్ సినిమాలో ఆమె హీరోయిన్‌గా న‌టించింది.

ఇక ఈ అమ్మ‌డు త‌న ఇన్‌స్టాలో ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తూనే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చిట్ చాట్ చేస్తూ వారు అడిగే చిలిపి ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్లు ఇస్తూనే ఉంటుంది. తాజాగా చిట్‌చాట్‌లో ఓ అభిమాని వేసిన ప్ర‌శ్న‌కు ఆమె ఇచ్చిన కౌంట‌ర్ చూసిన అభిమానులు స‌రైన ఆన్స‌ర్ ఇచ్చింద‌ని మెచ్చుకుంటూ ఉంటుంటే .. కొంద‌రు మాత్రం దిశాకు ఎంత త‌ల‌పొగ‌రు ? అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కొంద‌రు ఆక‌తాయిలు ఆమెను ఇష్టానుసారం ప్ర‌శ్న‌లు అడిగారు. అయితే కొంద‌రు మాత్రం ఆమెను ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రించారు. తిక్క ప్ర‌శ్న‌లు వేశారు. అయితే ఆ ప్ర‌శ్న‌లు వేసిన‌వారికి ఆమె దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది. ఓ వ్య‌క్తి మీ బికినీ ఫోటో షేర్ చేయ‌మ‌ని అడిగాడు. అయితే ఆ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్‌ను దిశ స్కిప్ చేయ‌లేదు. ఒక జంతువుకు బికినీ వేసి ఉన్న ఫోటో షేర్ చేయ‌డంతో నెటిజ‌న్లు అంతా ఆమె చేసిన ప‌నితో షాక్ అయ్యారు.

సాధార‌ణంగా సెల‌బ్రిటీల‌కు.. హాట్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ల‌కు అభిమానులు. ఆక‌తాయిల నుంచి ఇలాంటి ప్ర‌శ్న‌లు వ‌స్తూనే ఉంటాయి. అయితే దిశ మాత్రం త‌న‌దైన స్టైల్లో ఆ ఆక‌తాయికి కౌంట‌ర్ ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news