Moviesఆ స్టార్ హీరోతో కృతి రొమాన్స్.. తేడాలు వస్తే చంప పగిలిపోద్ది..ఎందుకంటే..?

ఆ స్టార్ హీరోతో కృతి రొమాన్స్.. తేడాలు వస్తే చంప పగిలిపోద్ది..ఎందుకంటే..?

కృతిశెట్టి.. ఏ ముహూర్తానా ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యిందో కానీ..అప్పటి నుండి అందరు డైరెక్టర్లకి ప్రోడ్యూసర్ల కి ఆమెనే కావాలి. కృతి వాళ్ళ పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది. చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వడం..బాక్స్ ఆఫిస్ వద్ద కలెక్షన్స్ భారీ స్దాయిలో రావడం…ఇది చాలు ఇండస్ట్రీలో అమ్మడు మరో 10 ఏళ్ళు రాజ్యమేలుతుంది అనడానికి. ఎప్పటి నుండో ఉంటున్న స్టార్ హీరోయిన్లని కాదని బడా హీరోలు కూడా ఈమెకే అవకాశలు ఇవ్వడం ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయం.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నా..క్షణం కూడా తీరిక లేకుండా షూటింగ్ లు చేస్తున్న ఈ బ్యూటీకి రీసెంట్ గా అద్దిరిపోయే ఆఫర్ వచ్చిందట. అలాంటి ఇలాంటి ఆఫర్ కాదండోయ్..ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే ఈటీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సూర్య..ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ ని తెచ్చిపెట్టలేకపోయింది. కానీ సూర్య నటనకి మంచి మార్కులే పడ్డాయి.

కాగా ఈ స్టార్ హీరో త్వ‌ర‌లోనే మ‌రో కొత్త సినిమా మొద‌లుపెట్ట‌నున్నాడు అని..ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కన్నడ బ్యూటీ టాలీవుడ్ లక్కి దేవత కృతిశెట్టిని ఫిక్స్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఇంత వరకు బాగానే ఉన్నా..ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఈ సినిమా ఎవరి డైరెక్షన్ లో రాబోతుందో తెలుసా.. స్టార్ డైరెక్ట‌ర్ బాలా. ఇప్ప‌టికే సూర్య బాలా కాంబినేష‌న్ లో నందా, శివ‌పుత్రుడు సినిమాలు రాగా అవి బ్లాక్ బాస్ట‌ర్ హిట్స్ గా నిలిచాయి. నిజానికి బాలా లాంటి గొప్ప డైరెక్షన్ లో నటించడం కృతి అదృష్టం అనే చెప్పాలి. కానీ ఆమె బాలా చెప్పిన్నట్లు నటించకపోయినా ..ఆయన చెప్పిన ఎక్స్ ప్రేషన్స్ ఇవ్వకపోయినా కృతి చెంప పగలడం గ్యారెంటీ అంటున్నారు నెటిజన్స్. గతంలో బాలా చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్ల విషయంలో ఇలానే బీహేవ్ చేశారరనే టాక్ ఉంది. మరి కృతి ఏం చేస్తుందో..చూడాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news