MoviesRRR లో హీరోయిన్ గా ఆలియాని ఏం చూసి పెట్టుకున్నారో తెలుసా..!!

RRR లో హీరోయిన్ గా ఆలియాని ఏం చూసి పెట్టుకున్నారో తెలుసా..!!

గత రెండు సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆలియా థియేటర్ల‌ లోకి వస్తుందా ? అని కోట్లాది మంది అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత తెరకెక్కింది త్రిబుల్ ఆర్ మూవీ. భార‌తేద‌శ సినిమా చ‌రిత్ర‌ను ప్ర‌పంచ స్థాయికి తీసుకువెళ్లి.. చాలా దేశాల వాళ్ల‌ను కూడా భ‌య‌పెట్టిన సినిమా బాహుబ‌లి. అలాంటి గొప్ప సినిమా త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన సినిమా త్రిబుల్ ఆర్‌.

ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఇద్దరు బడా హీరోలే కావడం. టాలీవుడ్ లో స్టా హీరోలు అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా మార్చి 25 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. అగ్ర నిర్మాత డివివి దానయ్య రు. 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్ ల్లో తారక్-చరణ్-రాజమౌళి..ముగ్గురు కూడా ఎనర్గిటిక్ గా పాల్గోంటున్నారు.

కాగా సినిమా రిలీజ్ డేట్ దగ్గరకి వస్తుండటంతో ముగ్గురు కూడా ఆర్ ఆర్ ఆర్ ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నే ఓ ప్రముఖ పత్రికా చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో పాల్గోన్న రాజమౌళి సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా కోసం చరణ -తారక్ చాలా కష్టపడ్డారని..దాదాపు నాలుగేళ్ళు తమ జీవితాని ఈ సినిమా కోసమే త్యాగం చేశారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఆలియానే ఎందుకు హీరోయిన్ గా పెట్టారు అని యాంకర్ ప్రశ్నించగా..రాజమౌళి అద్దిరిపోయే రిప్లై ఇచ్చాడు.

ఈ సినిమా కోసం ఆలియా లుక్స్‌ చూసి సీత పాత్రకు ఎంచుకోలేదని క్లారిటీ ఇస్తూనే… ఆయన రాసుకున్న కథలో సీత పాత్రకి ఎవ్వరు సూట్ అవుతారా అని ఆలోచిచగానే మొదట అనిపించిన పేరు ఆలియా అని.. ఈ పాత్రల్లో ముఖం చూడగానే సాయం చేయాలనే అమాయకత్వం కనిపించాలి.. అలానే నీరు, నిప్పు అనే ఇద్దరు వ్యక్తులను కంట్రోల్‌ చేయగలిగే మనోధైర్యం కూడా ఉండాలి… ఈ రెండూ ఆలియాలో నాకు కనిపించాయి. అందుకే ఆమెను సీత పాత్రకి తీసుకున్నాను”.. అంటూ చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news