Moviesసింగ‌ర్ శ్రీరామ్ బండారం బ‌య‌ట‌పెట్టేసిన శ్రీరెడ్డి... భ‌లే రెచ్చ‌గొట్టిందిగా...!

సింగ‌ర్ శ్రీరామ్ బండారం బ‌య‌ట‌పెట్టేసిన శ్రీరెడ్డి… భ‌లే రెచ్చ‌గొట్టిందిగా…!

సినీ నటి శ్రీరెడ్డి సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక హాట్ కామెంట్ల‌తో వార్త‌ల్లో ఉండేందుకే ఇష్ట‌ప‌డుతూ ఉంటుంది. అస‌లు వివాదం లేక‌పోతే ఆమెకు రోజు గ‌డ‌వదు అన్న‌ట్టుగా ఆమె వ్య‌వ‌హార శైలీ ఉంటుంది. కాంట్ర‌వ‌ర్సీల‌తో ఎప్పుడూ స‌హ‌జీవ‌నం చేసే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉదంతంతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యింది. అటు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి కూడా ఆమె చేసిన కామెంట్లు ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేయ‌డంతో పాటు ప‌వ‌న్ అభిమానుల‌కు శ్రీరెడ్డి బాగా టార్గెట్ అయ్యేలా చేశాయి.

కేవ‌లం తెలుగు ఇండ‌స్ట్రీలో ఇన్న‌ర్‌గా జ‌రిగే విష‌యాల‌తో పాటు అటు త‌మిళంలోనూ హీరోలు, హీరోయిన్ల గురించి కూడా కొన్ని ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను ఆమె లీక్ చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు బిగ్ బాంబ్‌లు పేల్చుతూనే ఉంటారు. కేవ‌లం సినిమా విష‌యాలే కాదు… రాజ‌కీయ ప‌ర‌మైన విష‌యాల‌పై కూడా ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు కామెంట్లు చేస్తూ వ‌స్తోంది. వైసీపీకి, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు శ్రీరెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు స‌పోర్ట్ చేసుకుంటూ వ‌స్తుంది.

ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో చాలా మంది బండారం బ‌య‌ట పెట్టిన శ్రీరెడ్డి ఇప్పుడు ఇండియ‌న్ ఐడల్ విన్న‌ర్ శ్రీరామ్‌ను టార్గెట్ చేస్తోంది. గ‌తంలో శ్రీరామ్ త‌న‌తో స‌న్నిహితంగా ఉన్నాడంటూనే.. అందుకు సంబంధించిన ఫొటోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. త‌న‌తో శ్రీరామ్ చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ తీసి ఇమేజ్‌ను కూడా పోస్ట్ చేసింది. అయితే ఆ మెసేజ్‌లో శ్రీరెడ్డి.. శ్రీరామ్‌ను రెచ్చ‌గొట్టిన‌ట్టు ఉండ‌డంతో కొంద‌రు నెటిజ‌న్లు శ్రీరామ్‌కు స‌పోర్ట్‌గా కామెంట్లు చేస్తున్నారు.

ఇది నాలుగేళ్ల క్రింద‌ట జ‌రిగిన సంఘ‌ట‌న‌.. అయితే ఇప్పుడు శ్రీరెడ్డి దీనిని బ‌య‌ట పెట్ట‌డానికి ఓ కార‌ణం కూడా ఉంద‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. శ్రీరామ్ ఇండియ‌న్ ఐడ‌ల్ విన్న‌ర్ కావ‌డంతో మ‌నోడికి మాంచి క్రేజ్ ఉంది. శ్రీరామ్ అంటే ప‌డ‌ని వారు కావాల‌నే కొంద‌రు ఇలా శ్రీరెడ్డితో టార్గెట్ చేయిస్తున్నారంటూ శ్రీరామ్ అభిమానులు నెట్టింట్లో చ‌ర్చ పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news