Moviesశిల్పాశెట్టి - రాజ్‌కుంద్రా విడాకుల‌కు ముహూర్తం ఫిక్స్‌.... సాక్ష్యాలు ఇవే...!

శిల్పాశెట్టి – రాజ్‌కుంద్రా విడాకుల‌కు ముహూర్తం ఫిక్స్‌…. సాక్ష్యాలు ఇవే…!

ప్ర‌స్తుతం సినిమా వాళ్లు వ‌రుస పెట్టి విడాకుల మీద విడాకులు తీసుకుంటున్నారు. గ‌తేడాది చివ‌ర్లో బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ – కిర‌ణ్‌రావు విడాకులు తీసుకున్నారు. అనంత‌రం అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత కూడా నాలుగేళ్ల బంధానికి స్వ‌స్తి ప‌లికేస్తూ విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ డి.ఇమ్మాన్ తన భార్య మోనికా రిచర్డ్ తో విడిపోయినట్లు ప్రక‌టించారు. ఇక 44 ఏళ్ల వయసులో మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్.. 28 ఏళ్ల యువ మోడల్ రోహమన్ షాల్‌తో కొన్నేళ్లుగా కొన‌సాగిస్తోన్న డేటింగ్‌కు స్వ‌స్తి ప‌లికేసింది. ఇక తామిద్ద‌రం స్నేహితులుగా ఉంటామ‌ని బ్రేక‌ప్ చెప్పేసింది.

ఇక ఈ జ‌న‌వ‌రిలో కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య – హీరో ధ‌నుష్ సైతం తమ వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికేస్తున్న‌ట్టు చెప్పారు. వీరు ఏకంగా 18 ఏళ్ల పాటు క‌లిసి ఉండి విడిపోవ‌డం ఎవ్వ‌రికి న‌చ్చ‌లేదు. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ సైతం త‌న భ‌ర్త క‌ళ్యాన్‌దేవ్ నుంచి విడాకులు తీసుకోబోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక మ‌రో సీనియ‌ర్ హీరో జేడీ చ‌క్ర‌వ‌ర్తి కూడా భార్య‌కు విడాకులు ఇచ్చేస్తున్నాడ‌ని అంటున్నారు.

ఈ లిస్టులోనే ఇప్పుడు బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ శిల్పాశెట్టి, ఆమె భ‌ర్త రాజ్‌కుంద్రా దంప‌తులు విడిపోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. నీలి చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్టు చేయ‌డం.. ఆ త‌ర్వాత శిల్పాను కూడా పోలీసులు విచారించ‌డం జ‌రిగిన‌ప్ప‌టి నుంచే ఈ దంప‌తుల బంధంపై ఏదో ఒక ప్ర‌చారం అయితే జ‌రుగుతూనే ఉంది.

ప్ర‌స్తుతం ఈ దంప‌తుల మ‌ధ్య ఆస్తి పంప‌కాలు కూడా జ‌రుగుతున్నాయ‌ట‌. రాజ్ కుంద్రా త‌న ఆస్తుల‌ను కొన్నింటిని శిల్పా పేర రిజిస్ట్రేష‌న్ చేయించిన‌ట్టు.. వీరు విడాకుల‌కు కూడా ద‌ర‌ఖాస్తులు చేసుకున్న‌ట్టు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే కొన్ని ఆస్తులు శిల్పా పేరిట బ‌ద‌లాయింపు ప్ర‌క్రియ కూడా జ‌రిగింద‌ని అంటున్నారు.

ఇక శిల్పా తెలుగులో కూడా ప‌లు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. నాగార్జున‌తో అజాద్ – వెంకటేష్ తో సాహస వీరుడు సాగర కన్య – బాలకృష్ణతో భలే వాడివి బాసూ – మోహన్ బాబుకు జోడీగా వీడెవడండి బాబూ సినిమాలు చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news