Moviesలీకైన రవితేజ లిప్ లాక్ ఫోటో..నెట్టింట వైరల్ గా మారిన పిక్..!!

లీకైన రవితేజ లిప్ లాక్ ఫోటో..నెట్టింట వైరల్ గా మారిన పిక్..!!

ఒక్కప్పుడు మాస్ మహరాజా రవితేజ పేరు చెప్పితే జనాలు ఊగిపోయేవారు. ఆయన చెప్పే మాస్ డైలాగ్స్ కి..డ్యాన్స్ స్టెప్పులకి యువత బాగా అట్రాక్ట్ అయ్యింది. కొంత కాలం వరకు ఆ జోరు కొనసాగిన ఈ మధ్య కాలంలో మాత్రం రవితేజ పవర్ తగ్గిందనే చెప్పాలి. గత కొంత కాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న రవితేజ కి..గోపిచంద మల్లినేని క్రాక్ సినిమా రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు రవితేజ. దీంతో మళ్ళీ ఆయనకు అవకాశాలు క్యూ కట్టాయి.

ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీ గా ఉన్నాడు రవితేజ. కాగా, రవితేజ హీరోగా నటించిన చిత్రం ఖిలాడి. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ర‌వితేజ డ్యూయెల్ రోల్ కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో రవితేజ సరసన అందాల ముద్దుగుమ్మలు మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యాతి హీరోయిన్స్‌గా న‌టించారు. ఈ సినిమాకి మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ దేవిశ్రీప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్. ఈ చిత్రానికి ఆయన మాట‌ల‌ను అందించారు. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై స‌త్య‌నారాయ‌ణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ కోవిడ్ కార‌ణంగా లేట్ అయ్యింది. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ‘ఖిలాడీ’ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమైయారు.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి షాకింగ్ పిక్ లీకైంది. ఆ ఫోటోలో రవితేజ హీరోయిన్ తో లిప్ లాక్ లో ఉన్నత్ళు కనిపిస్తుంది. ఈ సినిమాలో మాస్ మహారాజ హీరోయిన్లతో కాస్తా ఘాటైన రొమాంటిక్ సీన్స్ చేసిన్నట్లు టాక్ కూడా వినిపిస్తుంది. అంటే ఈసారి రవితేజ రాజాగా మారి అభిమానులకు రొమాంటిక్ ట్రీట్‌ ఇవ్వబోతున్నాడన్నమాట. ఇప్పటివరకూ ‘ఖిలాడీ’ పోస్టర్స్ చూసిన అభిమానులు జనాలు ఈ సినిమా లో రవితేజ సీరియస్ గానే కనిపిస్తారు అనుకున్న వారంతా ఈ పిక్ లీక్ అవ్వడంతో మసాలాను కూడా బాగానే దట్టించినట్టున్నారని అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి ఈ సినిమా ద్వార రవితేజ ఎలాంటి విజయం అందుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news