MoviesOfficial: బిగ్ బాస్ ఓటీటీ ప్రోమో వచ్చేసిందోచ్..స్ట్రీమింగ్ డేట్ ఇదే..!!

Official: బిగ్ బాస్ ఓటీటీ ప్రోమో వచ్చేసిందోచ్..స్ట్రీమింగ్ డేట్ ఇదే..!!

బిగ్ బాస్ .. తెలుగులోనే అతి పెద్ద రియాలిటి షో. ఈ షో తెలుగునాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో స్టార్ట్ అవుతుంది అని తెలిసినప్పటి నుండే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన న్యూస్ లు అన్ని వైరల్ గా మారుతుంటాయి. బిగ్ బాస్ షో అంటే ఇష్టపడే వారు ఎంత మంది ఉన్నారో అంతకన్నా తిట్టుకునేవారు కూడా చాలా మందే ఉన్నారు.

హౌస్ లోకి వెళ్లేంత వరకు ఒకలా..లోపలికి వెళ్ళాక మరోకలా చూయిస్తుంటారు అనే పేరు ఉంది.ఇక ఈ సారి ఇలాంటి గొల లేకుండా ఏక్మగా 24*7 ఆ బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో మనమే చూసే విధంగా బిగ్ బాస్ ఓటీటీలో ప్రసారం కానుంది. 24*7 అంటే 24 గంటలూ ఏకదాటిగా ఈ షోని హాట్ స్టార్‌లో లైవ్ ప్రసారం చేయనున్నట్టు ఇప్పటికే టీం తెలిపారు.

అయితే తాజాగా కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసారు. ఫిబ్రవరి 26న డిస్నీ హాట్ స్టార్‌లో ప్రారంభం కానుంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున, వెన్నెల కిషోర్, మురళీ శర్మ వంటి వారు నటించారు. వెన్నెల కిషోర్ కి పిక్ పాకెట్ కేసులో ఉరి శిక్ష పడుతోంది. పోలీస్ అయిన మురళి శర్మ, వెన్నెల కిషోర్ కి ఉరి వేయడానికి తీసుకెళ్తుండగా.. లాయర్ అయిన నాగార్జున వచ్చి బిగ్ బాస్ పేరుని ఉపయోగిస్తూ.. ఉరి శిక్ష నుండి తప్పిస్తాడు.

ఫైనల్ గా హోస్ట్ నాగార్జున వచ్చి చూసారుగా నో కామా, నో ఫుల్ స్టాప్.. ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్.. మీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో .. త్వరలో మీ ముందుకు రానుంది అంటూ ప్రోమో ను ఎండ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. 24 గంటలు ఎంతో రసవత్తరంగా సాగే బిగ్ బాస్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే అనేట్లుగా ప్రోమో ను కట్ చేశారు.

ఈ క్రమంలో బిగ్ బాస్ ఓటీటీలోకి వెల్లే సెలబ్రిటీల పేర్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరియానా, అఖిల్, సోహెల్ వంటి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ షోలో పాల్గొనబోతున్నట్లు పుకార్లు చక్కర్లు కొట్టాయి. కాగా బిగ్ బాస్ ఓటీటీ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకుల ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news