Moviesనెట్టింట మారుమ్రోగిపోతున్న కృతిశెట్టి పేరు..కంగ్రాట్స్ అంటూ మెసేజ్లు ..ఎందుకంటే!!

నెట్టింట మారుమ్రోగిపోతున్న కృతిశెట్టి పేరు..కంగ్రాట్స్ అంటూ మెసేజ్లు ..ఎందుకంటే!!

కృతి శెట్టి..ఒక్కటి అంటే ఒక్క సినిమాతోనే తన టాలెంట్ ను బయట్టేసిన కన్నడ బ్యూటి. చూసేందుకు చక్కటి రూపం..చూడగానే ఆకర్షించే అందం..కళ్ళతోనే ఎటువంటి ఎక్స్ ప్రేషన్స్ ని అయిన పలికించగల కృతి కి అభిమానులు ఓ రేంజ్ లో ఉన్నారు. అమ్మడు అంటే పడి చచ్చిపోతున్నారు. ఫస్ట్ సినిమాతోనే మెగా హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ..ఇప్పుడు బడా బడా స్టార్ హీరోల సరసన నటించడానికి కుడా సిద్ధమైంది.

డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్..హీరోగా అందాల తార కృతిశెట్టి నటించిన సినిమా ఉప్పెన . ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమాతో వైష్ణవ్-కృతి బ్లాక్ బస్టర్ హిట్ ని తమ ఖాతాలో వేసుకున్నారు. కృతిశెట్టి ఈ సినిమాలో లంగా వోణీలు కట్టుకుని చాలా అందంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో కృతి తండ్రిగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించి సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఇక ఈ సినిమా గతేడాది 2021 ఫిబ్రవరి 12న విడుదలైంది. కాగా తన ఫస్ట్ సినిమా చేసి వన్ ఇయర్ కంప్లీట్ అయిన సంధర్భంగా బేబమ్మా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. “అందరికి లైఫ్ లో ఒకటే పుట్టినరోజు ఉంటాది. కానీ నా జీవితంలో రెండు పుట్టిన రోజులు ఉన్నాయి. అందులో ఒకటిమనం పుట్టినరోజు. ఇంకొకటి.. ఏడాది క్రితం నేను నటిగా పరిశ్రమలో అడుగుపెట్టాను.

కాబట్టి ఈరోజు నాకిది మరో పుట్టినరోజుగా భావిస్తున్నా. నన్ను హీరోయిన్ గా ఎంకరేజ్ చేస్తున్న మీ అందరూ ప్రేమ, అభిమానానికి చాలా ద్యాంక్స్. ఇక పై కూడా నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నా. థాంక్యూ ఆల్‌’ అంటూ రాసుకొచ్చింది. ఇక బేబమ్మ మాటలకి అందరు ఫిదా అవుతున్నారు. కంగ్రాట్స్ చెపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news