Moviesరియ‌ల్ పెళ్లికూతురు అవుతోన్న కియారా అద్వానీ.. ముహూర్తం కూడా ఫిక్స్‌..!

రియ‌ల్ పెళ్లికూతురు అవుతోన్న కియారా అద్వానీ.. ముహూర్తం కూడా ఫిక్స్‌..!

బాలీవుడ్‌లో మ‌రో ప్రేమ జంట పెళ్లిపీట‌లు ఎక్క‌బోతోంది. కొంత కాలంగా పీక‌ల్లోతు డేటింగ్‌లో ఉన్న క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ – సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ఇద్ద‌రూ కూడా త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నారు. వీరిద్ద‌రు సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉన్నార‌ని బాలీవుడ్‌లో ఎప్పుడూ వార్త‌లు గుప్పుమంటున్నాయి. అయితే వీరిద్ద‌రు ఎప్పుడు దీనిపై నోరు మెద‌ప‌లేదు. అయితే వీరిద్ద‌రు హాలీడే వెకేష‌న్స్‌కు చెక్కేయ‌డం, ముంబై రోడ్ల‌పై చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగేస్తూ ఉండ‌డంతో చాలాసార్లు కెమేరా క‌ళ్ల‌కు చిక్కేశారు.

ఇక కియారా చాలా సార్లు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియోలు, ఫొటోలు గ‌తంలో చాలాసార్లు వైర‌ల్ అయ్యాయి. ఇక ఇటీవ‌ల బాలీవుడ్ ప్రేమ‌ప‌క్షులు వ‌రుస‌గా పెళ్లిపీట‌లు ఎక్కేస్తున్నారు. కొద్ది రోజుల క్రిత‌మే స్టార్ హీరోయిన్‌, ముదురు ముద్దుగుమ్మ క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్ సీక్రెట్‌గానే వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు. వ‌య‌స్సులో విక్కీ కంటే క‌త్రినా పెద్ద‌ది అయినా వీరి మ‌ధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు.

ఇక వెండితెర‌పై సిద్ధార్థ్ – కియారా జంట క‌లిసి న‌టించింది ఒక్క సినిమాలోనే.. అయినా వీరిద్ద‌రి కెమిస్ట్రీకి ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. వీరిని వెండితెర మీద చూసిన‌ప్పుడే వీరు రియ‌ల్ లైఫ్ జంట అయితే ఎంత బాగుంటుంది అని చాలా మంది ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు అదే నిజం కాబోతోంది. వీరి పెళ్లికి ఇరువైపులా కుటుంబాలు కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేయ‌డంతో పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

2022 మిడిల్‌లో లేదా ఈ యేడాది న‌వంబ‌ర్‌ / డిసెంబ‌ర్‌లో వీరి పెళ్లి ఉంటుంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా కియారా – సిద్ధార్థ్ పెళ్లి చేసుకుంటే ఈ జంట బాలీవుడ్‌లో మ‌రో రొమాంటిక్ క‌ఫుల్‌గా ఉంటారు. మ‌రి వీరి పెళ్లి వార్త‌లు, ముహూర్తం ఇదే అంటూ బీటౌన్‌లో వార్త‌లు గుప్పుమంటోన్న వేళ ఈ ప్రేమ ప‌క్షులు ఎలా స్పందిస్తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news