Movies' భీమ్లానాయక్ ' ఏపీ - తెలంగాణ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.....

‘ భీమ్లానాయక్ ‘ ఏపీ – తెలంగాణ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. నైజాంలో దుమ్ము లేపిన ప‌వ‌న్‌..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లానాయ‌క్ సినిమా నిన్న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దాదాపు రెండేళ్లుగా ఊరించి ఊరించి ఎట్ట‌కేల‌కు నిన్న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఇక నైజాంలో తొలి రోజు వ‌సూళ్ల‌లో భీమ్లానాయ‌క్ దుమ్ము రేపేసింది. తొలి రోజు ఈ సినిమా ఏకంగా రు 11.80 కోట్ల షేర్ రాట్టింది. ఇది నైజాంలో ఆల్ టైం ఫ‌స్ట్ డే షేర్‌గా రికార్డుల‌కు ఎక్కింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డ్ ఇటీవ‌ల వ‌చ్చిన పుష్ప ది రైజ్ – 11.44 కోట్లు పేరిట ఉండేది. ఈ రికార్డును భీమ్లా క్రాస్ చేసింది.

ఇక నైజాంలో ఈ రెండు సినిమాల త‌ర్వాత సాహో (9.41 Cr) – బాహుబలి 2 (8.9 Cr) – వకీల్ సాబ్ (8.75 కోట్లు) – సరిలేరు నీకెవ్వరు (8.67 కోట్లు) సినిమాలు టాప్ ప్లేసులో ఉన్నాయి. ఇప్పుడు భీమ్లా ఆ సినిమాల వ‌సూళ్లు దాటేసి స‌రికొత్త ఫీట్ న‌మోదు చేసింది. ఇక ట్రేడ్ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం తొలి రోజు భీమ్లా ఏపీ, తెలంగాణ‌లో రు 32.56 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.

ఇక ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే 1.25 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వెళ్లి తిరిగి సినిమాల్లోకి వ‌చ్చినా కూడా ప‌వ‌న్ ప‌వ‌ర్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఈ సినిమా మ‌రోసారి ఫ్రూవ్ చేసింది. ఏరియాల వారీగా ఈ సినిమా వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 11.80 కోట్లు
సీడెడ్ – 4.30 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.06 కోట్లు
ఈస్ట్ – 2.09 కోట్లు
వెస్ట్ – 2.30 కోట్లు
గుంటూరు – 2.10 కోట్లు
కృష్ణ – 2.01 కోట్లు
నెల్లూరు – 2.18 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news