Moviesఅలా చేసేసరికి లాగి కొడదామనుకున్నా..వినోద్‌ కుమార్‌ కి ఆ హీరో అంటే...

అలా చేసేసరికి లాగి కొడదామనుకున్నా..వినోద్‌ కుమార్‌ కి ఆ హీరో అంటే అంత కోపమా..?

వినోద్ కుమార్.. ఈ ఒకప్పటి హీరో గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే నేటి తరం వాళ్లకి కూడా ఈయన బాగా తెలుసు. ఇప్పటికి అడపాదడపా సినిమాల్లల్లో నటిస్తూ..మనకు తెర పై తండి..విలన్ పాత్రలల్లో కనిపిస్తుంటాడు. నిజం చెప్పాలంటే ఈయన ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. ఇంకా తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో నటించాడు కానీ ఆయన ఎక్కువ చేసింది..పాపులారిటీ తెచ్చుకుంది మాత్రం తెలుగు సినిమాలతోనే. వినోద్ కుమార్ మొదటి చిత్రం 1985లో విడుదలైన కన్నడ చిత్రం తవరు మనే. తెలుగులో మొట్టమొదటి చిత్రం రామోజీ రావు నిర్మించగా 1989 లో విడుదలైన మౌన పోరాటం. ఈ సినిమా ఆయనకు మంచి పేరుని తెచ్చిపెట్టింది.

ఇక ఆ తరువాత మామగారు, కర్తవ్యం, భారత్ బంద్ లాంటి సినిమాలు అతనికి కథానాయకుడిగా మరో మెట్టు ఎక్కించిన చిత్రాలు. 1991 లో మామగారు సినిమాకు గాను ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు వచ్చింది. దాదాపు టాలీవుడ్ లో అరవై సినిమాలు వరకు చేసి హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వినోద్ కుమార్. తాజాగా ఓ టీవీ షోకు హాజరైన సీనియర్‌ నటుడు వినోద్‌ కుమార్‌ తన వ్యక్తిగత, సినిమా విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో తను ఓ హీరోని కొడదామనుకున్నా అంటూ షాకింగ్ న్యూస్ రీవిల్ చేశాడు.

నిజీఅనికి వినయ్ నటించిన కర్తవ్యం సినిమాకి సాయికుమార్ వినోద్ కి డబ్బింగ్ చెప్పాలిసి ఉన్నిందట కానీ ఆయన చెప్పను అనేసిరికి ..వినోద్ కి కోపం వచ్చి..లాగి కొడదామనుకున్నారట అనే విషయాని వినోద్ సరదాగా వెల్లడించాడు. ఇక అదే క్రమంలో దాసరి, కోడి రామకృష్ణ, మోహన్ గాంధీ లాంటి దర్శకులతో సినిమాలు చేయడం వినోద్ అదృష్టమని అతను తెలిపాడు. ఇక హోస్ట్ ఆలీ మాత్లాడుతూ..మీకు అంబానీ తరువాత అంతా ఆస్తులు ఉన్నాయి కదా అని అడిగిన్నప్పుడు..వినోద్ మాట్లాడుతూ..అన్ని ఆస్తులు ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటా..ఎప్పుడో లండన్ కి వెళ్లిపోయి ఉండెవాడిని అంటూ సర్దాగా ఆన్సర్ ఇచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news