Moviesనిన్ను కిస్ చేయడం నాకు ఇష్టం లేదు..సల్మాన్‌‌ కు డైరెక్ట్ గా...

నిన్ను కిస్ చేయడం నాకు ఇష్టం లేదు..సల్మాన్‌‌ కు డైరెక్ట్ గా చేప్పేసిన ఆ హీరోయిన్..!!

“మైనే ప్యార్‌ కియా” ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాను చూసే కొదరు లవ్ లో పడి పెళ్లి చేసుకునారనే వార్తలు అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో హీరో గా ఎంట్రీ ఇచ్చాదు సల్మాన్‌‌ ఖాన్. ఈ సినిమాలో సల్మాన్ రొమాటిక్ గా నతించి ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాతోనె హీరోయిన్ గా పరిచయమైంది భాగ్యశ్రీ.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో ప్రతి పాట ఇప్పటికి ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఓవర్ నైట్‌‌లో స్టార్ హీరోయిన్‌‌గా పేరు సంపాదించుకుంది భాగ్యశ్రీ. హిందీ సినిమా మైనే ప్యార్‌ కియా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన భాగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన యువరత్న రాణా సినిమాలో నటించారు. ఆ తరువాత కొంత కాలం బాలీవుడ్ ఇందస్ట్రీని ఏలేసింది భాగ్యశ్రీ..ఇప్పటికి ఈ అమ్మడుకి ఫ్యాన్స్ ఉన్నారు. అందులో మన స్టార్ హీరోలు కూడా ఉండటం ఆశ్చర్యకలిగించే విషయం.

అయితే మొదటి సినిమా షూటింగ్ లోనే అమ్మడుకి ఓ లిప్ లాక్ సీన్ పదిందట. ఈ సినిమాలో ఓ పాటలో సల్మాన్ భాగ్యశ్రీ ఓ హాట్ లిప్ లాక్ సీన్ చేయాల్సి ఉందట, కానీ, ఆమెకు అలాంటి సీన్స్ నతించదం ఇష్టం లేదట. ఈ విషయం డైరెక్టర్ కి చెప్పలేక..సల్మాన్ తోనే డైరెక్ట్ గా చెప్పేసిందట. పరిస్ధితిని అర్ధం చేసుకున్న హీరో..తనకే ఇష్టం లేదు ఈ సీన్ వద్దు అని మ్యానేజ్ చేశారట. ఇక ఫైనల్ గా ఆ కిస్ సీన్‌‌ని ఇద్దరి మధ్య గ్లాస్ అడ్డుపెట్టి పూర్తిచేశారట దర్శకుడు. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ గతంలో చెప్పడం విశేషం. ఇక ఈ సినిమాలోని ప్రతి సీన్ ప్రతి డైలాగ్ ప్రతి పాట ఓ ఆనిముత్యం లా ఉంటుంది.అందుకే ఇన్ని సంవత్సరాలు అయినా ఈ సినిమా ను యూట్యూబ్ లో ప్లే చేసుకుని మరీ చూస్తుంటారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news