Moviesహైబ్రిడ్ పిల్ల ఆ హీరోని సంతృప్తి పరిచిందా..సాయి పల్లవి స్టన్నింగ్ ఆన్సర్..!

హైబ్రిడ్ పిల్ల ఆ హీరోని సంతృప్తి పరిచిందా..సాయి పల్లవి స్టన్నింగ్ ఆన్సర్..!

ప్రస్తుతం ఉన్న కాలంలో హీరోయిన్స్ కి సాయి పల్లవికి చాలా తేడా ఉంది. ఈ విషయం మేము చెప్పడం కాదు ఎంతో మంది అభిమానులు ఫేస్ మీదనే చెప్పుతున్నారు. అందరి హీరోయిన్స్ లా ఆమె డబ్బు కోసం తన బాడీని ఎక్స్ పోజ్ చేయదు. స్టార్ హీరోల సినిమాలు అంటే ఎగేసుకుని పరిగెత్తదు. అవతలి వ్యక్తి ఎంత పెద్ద స్టార్ అయినా.. బ్లాక్ బస్టర్ హిట్స్ కేరాఫ్ అడ్రెస్ అయినా..ఇక్కడ సాయి పల్లవి తగ్గదు. కధ నచ్చితే డబ్బు గురించి ఆలోచించదు. తను నమ్మి చేసిన సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేస్తుంది. అలాంటి మంచి క్యారెక్టర్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. నిజం చెప్పాలంటే ఈరోజుల్లో ఇలాంటి హీరోయిన్ దొరకడం చాలా కష్టం.

టాలీవుడ్ లో ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన అచ్చం తెలంగాణ అమ్మాయిలా ఎంతో చలాకీగా నటించిన సాయి పల్లవికి తర్వాత వరుసగా తెలుగు, తమిళ, మళియాళ మూవీస్ లో ఛాన్సులు వస్తున్నాయి. సాయి పల్లవి తాను నటించే పాత్రల్లో ఎప్పుడూ వైవిద్యం ఉండేలా చూసుకుంటుంది. నటనకు దగ్గరగా..ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉండేలా సినిమాలు సెలక్ట్ చేసుకుంటూ తనదైన స్టైల్లో రాణిస్తుంది ఈ హైబ్రీడ్ పిల్ల.

అయితే, టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తో అప్పుడెప్పుడో కణం అనే మూవీ చేసింది సాయి పల్లవి. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ, ఆ సినిమా షూటింగ్ టైంలో సాయి పల్లవి వల్ల నాగశౌర్య చాలా ఇబ్బందులు పడ్డారట. టైం కు సరిగ్గా సెట్స్ కు రాదని, బిహేవియర్ బాగోదని..కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశాడు. అయితే అప్పుడెప్పుడొ శౌర్య అన్న మాటలకు సాయి పల్లవి ఇప్పుడు రిప్లై ఇచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ ..”నేను నాగశౌర్య కామెంట్స్ ని తప్పుగా తీసుకోలేదు. నేను ఆ సినిమా డైరెక్టర్ కి, కెమారా మెన్ కి ఫోన్ చేసి కూడా ఇలాగే అడిగా నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారా అని..వాళ్లు నో అనే సమాధానం ఇచ్చారు. శౌర్య నా వల్ల నాలో నచ్చనిది మాత్రమే చెప్పారు. అయినా నా వల్ల తను బాధపడడం నాకు బాధకలిగిస్తుంది. నా ఆన్సర్ విని ఆయన సంతృప్తి చెందుతాడని అనుకుంటున్నా” అంటూ క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news