Moviesసీనియ‌ర్ హీరోయిన్ న‌గ్మా కెరీర్ నాశ‌నం చేసింది ఆ హీరోలేనా ?

సీనియ‌ర్ హీరోయిన్ న‌గ్మా కెరీర్ నాశ‌నం చేసింది ఆ హీరోలేనా ?

1990వ ద‌శ‌కంలో న‌గ్మా సౌత్ టు నార్త్ ఓ ఊపు ఊపేసింది. తెలుగులో స్టార్ హీరోల ప‌క్క‌న సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించిన న‌గ్మా ఆ త‌ర్వాత కోలీవుడ్‌, శాండ‌ల్‌వుడ్‌లో కూడా స్టార్ హీరోల‌తో సినిమా చేసి పాపుల‌ర్ అయ్యింది. ముఖ్యంగా పొగ‌రుబోతు ప్రియురాలు, పెళ్లాం పాత్ర‌ల్లో న‌టించాలంటే న‌గ్మాయే అప్పుడు ద‌ర్శ‌కులు, హీరోల‌కు బెస్ట్ ఆప్ష‌న్‌గా ఉండేది. త‌న అందాల‌తో కైపెక్కించ‌డంలో న‌గ్మాకు నగ్మాయే సాటి. సౌత్‌ను ఓ ఊపు ఊపేసిన న‌గ్మా ఆ త‌ర్వాత బాలీవుడ్‌, భోజ్‌పురి భాష‌ల్లో కూడా ఎన్నో హిట్ సినిమాలు చేసింది. భోజ్‌పురి భాష‌లో ఆమె అభిమానులు ఆమెను దేవ‌త‌గా ఆరాధించేసేవారు.

తెలుగులో న‌గ్మా చిరంజీవి, నాగార్జున, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, మోహ‌న్‌బాబు ప‌క్క‌న హిట్ సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చి కాంగ్రెస్ పార్టీలో కీల‌క పాత్ర‌లో ఉన్నారు. సినిమా, రాజ‌కీయాల్లో ఆమె స‌క్సెస్ అయినా ఆమె వ్య‌క్తిగ‌త జీవితం మాత్రం అనేకసార్లు ఒడిదుడుకుల‌కు లోనైంది. ఆమె ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా న‌లుగురు పెళ్లైన హీరోల‌తో ప్రేమాయ‌ణం న‌డిపింది. ఆమె వ్య‌క్తిగ‌త జీవితం ఎఫైర్ల‌లో చిక్కుకుని.. వివాదాల మ‌యం అయ్యింది.

న‌గ్మా భారత క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ సార‌వ్ గంగూలీతో ప్రేమ‌లో ప‌డింది. అప్ప‌టికే సౌర‌వ్‌కు డోనాతో పెళ్ల‌య్యింది. అయినా కూడా సౌర‌వ్‌ను పిచ్చ‌గా ప్రేమించిన న‌గ్మా అత‌డిని పెళ్లాడాల‌ని అనుకుంది. ఒకానొక ద‌శ‌లో న‌గ్మా కోసం సౌర‌వ్ సైతం భార్య డోనాకు విడాకులు ఇస్తాడంటూ ప్ర‌చారం జ‌రిగినా చివ‌ర‌కు న‌గ్మాకు హ్యాండ్ ఇచ్చాడు. గంగూలీ – నగ్మా కలిసి అప్పట్లో రహస్యంగా పూజలు కూడా చేయ‌డం సంచ‌ల‌నం అయ్యింది.

సౌర‌వ్‌తో బ్రేక‌ప్ త‌ర్వాత కోలీవుడ్ సీనియ‌ర్ హీరో శ‌ర‌త్‌కుమార్‌తో ఎఫైర్ న‌డిపిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఆ విష‌యం తెలియ‌డంతోనే శ‌ర‌త్‌కుమార్ ఫ‌స్ట్ భార్య ( వ‌ర‌ల‌క్ష్మి త‌ల్లి) విడాకులు తీసుకుంది. ఆ త‌ర్వాత శ‌ర‌త్‌కుమార్‌తో కూడా బ్రేక‌ప్ అయ్యింది. శ‌ర‌త్‌కుమార్ పెళ్లి చేసుకుంటాన‌ని చెప్ప‌డంతోనే న‌గ్మా అత‌డిని పిచ్చిగా ప్రేమించేసింద‌ని అంటారు. ఆ త‌ర్వాత భోజ్‌పురిలోకి వెళ్లిన న‌గ్మా అక్క‌డ ర‌వికిష‌న్‌తో చాలా సినిమాలు చేసింది. ఆ టైంలోనే వారిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ర‌వికిష‌న్ అంటే ప్ర‌స్తుతం యూపీలోని ఘోర‌క్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు.

ర‌వికిష‌న్ – న‌గ్మా ఎఫైర్ వార్త‌లు తెలిసిన ర‌వికిష‌న్ భార్య ప్రీతి ర‌వికిష‌న్‌తో గొడ‌వ ప‌డ‌డంతో ఆ గొడ‌వ ప‌డ‌లేక చివ‌ర‌కు న‌గ్మాకు దూర‌మ‌య్యాడు. రవికిషన్‌తో విడిపోయాక న‌గ్మా మ‌రో భోజ్‌పురి న‌టుడు మ‌నోజ్ తివారీతో ప్రేమాయ‌ణం న‌డిపింద‌ని ( మ‌నోజ్ తివారి ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ఎంపీ) అంటారు. అప్ప‌ట్లో భోజ్‌పురిలో ర‌వికిష‌న్‌, మ‌నోజ్ తివారి మ‌ధ్య పెద్ద పోటీ ఉండేది. వారిద్ద‌రు కూడా న‌గ్మాతో ఎఫైర్ వార్త‌ల‌ను బ‌హిరంగంగానే ఖండించారు. ఏదేమైనా ఈ హీరోలు అంద‌రూ కూడా న‌గ్మా లైఫ్‌తో ఆడుకున్నార‌నే అనాలి. ఇప్పుడు 48 ఏళ్ల‌కు చేరువ అయినా కూడా న‌గ్మా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news