Moviesఒక్క సినిమా ఛాన్స్ రావాలంటే... హీరోయిన్ 3 క‌మిట్‌మెంట్లు ఇవ్వాలా ?

ఒక్క సినిమా ఛాన్స్ రావాలంటే… హీరోయిన్ 3 క‌మిట్‌మెంట్లు ఇవ్వాలా ?

టాలీవుడ్‌లో ఇటీవ‌ల కొత్త సంప్ర‌దాయం మొద‌లైంది. అప్పుడ‌ప్పుడే ఎదుగుతున్న హీరోయిన్ల నుంచి.. స్టార్ హీరోయిన్ల వ‌ర‌కు అంద‌రూ కూడా ఒక్క సినిమాలో ఛాన్స్ రావాలంటే.. మూడు సినిమాల్లో చేస్తామ‌ని ముందుగానే క‌మిట్‌మెంట్లు ఇవ్వాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. వారికి ఇష్టంలేక‌పోయినా.. క‌ష్టం అయినా కూడా ఇలా త‌ప్ప‌క చేయ‌ని ప‌రిస్థితులు ఉన్నాయి. స్టార్ హీరోనో లేదా స్టార్ ద‌ర్శ‌కుడో ఓ హీరోయిన్‌కు ఛాన్స్ ఇస్తామంటున్నారు.. అయితే ఆ ఒక్క సినిమా కాదు.. మాతో మూడు సినిమాలు చేస్తామ‌న్న డీల్‌కు ఓకే చెపితేనే ఈ ఛాన్స్ ఇస్తామంటూ చెపుతున్నారు.

స్టార్ హీరో, స్టార్ డైరెక్ట‌ర్ సినిమా కావడంతో కొంద‌రు హీరోయిన్లు ఈ 3 క‌మిట్‌మెంట్ల‌కు ఓకే చెప్ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇదో సేఫ్ డీల్‌గా కూడా ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు భావిస్తున్నారు. త్రివిక్ర‌మ్ ఒకే హీరోయిన్‌ను త‌న సినిమాల్లో రెండు, మూడు సార్లు రిపీట్ చేస్తూ ఉంటారు. స‌మంత‌తో మూడు సినిమాలు చేసిన ఆయ‌న ఆ త‌ర్వాత పూజా హెగ్డేను వ‌రుస‌గా రిపీట్ చేస్తున్నారు. అంత‌కు ముందు ఇలియానాను కూడా ఆయ‌న వ‌రుసగా జులాయి, జ‌ల్సాలో రిపీట్ చేశారు.

ఇక ఇప్పుడు హీరోయిన్‌తో ఒకేసారి మూడు క‌మిట్‌మెంట్లు కుదుర్చుకోవ‌డం అనేది.. ఒక‌టి రెండు హిట్లు ప‌డినా వాళ్లు రెమ్యున‌రేష‌న్లు పెంచ‌కుండా కాస్త కంట్రోల్ చేసేందుకే అన్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో న‌డుస్తున్నాయి. ఇక త్రివిక్ర‌మ్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న‌తో ఒక్క సినిమా చేశాక ఏ హీరోయిన్ ఇమేజ్ అయినా అమాంతం పెరిగిపోతుంది. ఆయ‌న‌తో వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు.

అలాగే మ‌ళ‌యాళ హీరోయిన్ సంయుక్త మీన‌న్ త్రివిక్ర‌మ్ ర‌చ‌న చేస్తోన్న భీమ్లానాయ‌క్ సినిమాలో రానా భార్య పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే తాను నిర్మించే మ‌రో సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్‌గా ఫిక్స్ చేశార‌ట‌. ఒకేసారి ఆమెతో రెండు, మూడు సినిమాల క‌మిట్‌మెంట్లు కుదుర్చుకోవ‌డం వ‌ల్లే ఆమె వ‌రుస‌గా త్రివిక్ర‌మ్ హ్యాండ్ ఉన్న సినిమాల్లో చేస్తుంద‌ని అంటున్నారు. ఏదేమైనా ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఇదో కొత్త సంస్కృతి అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news