Moviesప్రేమ‌లోకంలోకి వెళ్లిపోయామ్‌... ' రాధే శ్యామ్ ' ఈ రాత‌లే సాంగ్...

ప్రేమ‌లోకంలోకి వెళ్లిపోయామ్‌… ‘ రాధే శ్యామ్ ‘ ఈ రాత‌లే సాంగ్ (వీడియో)

సాహో త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా తెర‌కెక్కిన భారీ బ‌డ్జెట్ మూవీ రాధే శ్యామ్‌. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా మూడేళ్లుగా షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. క‌రోనా కార‌ణంగా ప‌లుమార్లు వాయిదాలు ప‌డుతూ వ‌చ్చిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌భాస్‌కు జోడీగా పాన్ ఇండియా హీరోయిన్ పూజా హెగ్డే న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

యూర‌ప్‌లో 18వ శ‌తాబ్దంలో జ‌రిగిన ఓ య‌దార్థ సంఘ‌ట‌న ఆథారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంద‌ని ముందునుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. రు. 250 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో యూవీ క్రియేష‌న్స్ – గోపీ కృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్ర‌భాస్ పెద‌నాన్న రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాను స‌మ‌ర్పిస్తున్నారు. ప్ర‌భాస్ – పూజా హెగ్డే మ‌ధ్య వ‌చ్చే ప్రేమ స‌న్నివేశాలు, రొమాంటిక్ సీన్లు ఈ సినిమాలో హైలెట్‌గా నిలుస్తాయ‌ని.. మ‌న‌ల‌ను మ‌న‌మే మ‌ర్చిపోయే ఓ దృశ్య కావ్యంగా ఈ సినిమా నిలుస్తుంద‌ని ముందు నుంచి చెపుతూ వ‌స్తున్నారు.

ప్ర‌భాస్ చాలా రోజుల త‌ర్వాత చేసిన స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ కావ‌డంతో సినీ ల‌వ‌ర్స్ ఈ సినిమా కోసం ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. అందుకే సినిమా గురించి ఏ చిన్న పోస్ట‌ర్ వ‌చ్చినా.. వీడియో వ‌చ్చినా బాగా వైర‌ల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఈ రాత‌లే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. అస‌లు సాంగ్ వింటుంటే మ‌నం ఈ లోకం నుంచి మ‌రో లోకం లోకి వెళ్లిపోయిన‌ట్టుగా .. ఇంకా చెప్పాలంటే ల‌వ‌ర్స్ అయితే నిజంగా ప్రేమ మ‌ధురానుభూతుల్లోకి వెళ్లిపోవ‌డం ఖాయం.

ప్రభాస్ – పూజ ఇద్ద‌రి మ‌ధ్య చాలా రొమాంటిక్‌గా చూపించారు. ల‌వ్ ట్రాక్ చాలా అందంగా ఉంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news