Moviesఆ ఊళ్లో బాల‌య్య 11 డైరెక్ట్ సెంచ‌రీలు.. టాలీవుడ్‌లో తిర‌గ‌రాయ‌లేని రికార్డ్‌

ఆ ఊళ్లో బాల‌య్య 11 డైరెక్ట్ సెంచ‌రీలు.. టాలీవుడ్‌లో తిర‌గ‌రాయ‌లేని రికార్డ్‌

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌కు రాయ‌ల‌సీమ‌లో ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాల‌య్య‌కు తెలంగాణ‌, కోస్తా కంటే కూడా సీడెడ్‌లోనే తిరుగులేని అభిమానులు, మార్కెట్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బాల‌య్య‌కు వారి సొంత ప్రాంతం అయిన కృష్ణా, గుంటూరు కంటే కూడా సీడెడ్‌లోని నాలుగు జిల్లాల్లో వీరాభిమానులు ఉంటారు. బాల‌య్య సినిమాకు అక్క‌డ వ‌సూళ్లు ఎక్కువుగా ఉంటాయి. ఇన్నేళ్ల చ‌రిత్ర‌లో బాల‌య్య సినిమాలు ఎక్కువుగా రికార్డులు క్రియేట్ చేసింది కూడా రాయ‌ల‌సీమ‌లోనే..!

క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాలు అయితే బాల‌య్య‌కు కంచుకోట‌లుగా ఉంటాయి. లెజెండ్ అయితే ఏకంగా క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల్లో రెండు సెంట‌ర్ల‌లో 400 రోజులు ఆడింది. క‌డ‌ప‌లో ఓ సెంట‌ర్‌లో ఏకంగా 1100 రోజులు ఆడి తిరుగులేని రికార్డ్ నెల‌కొల్పింది. ఇదిలా ఉంటే క‌ర్నూలు జిల్లాలోని ఎమ్మిగ‌నూరు బాల‌య్య సినిమాల‌కు పెట్ట‌నికోట‌. బాల‌య్య సినిమా హిట్ అయ్యింది అంటే చాలు ఇక్క‌డ 100 రోజులు ప‌డిపోవాల్సిందే. ఈ సెంట‌ర్లో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 11 బాల‌య్య సినిమాలు 4 ఆట‌ల‌తో షిప్టింగ్ లేకుండా 100 రోజుల‌కు పైగా ఆడాయి. టాలీవుడ్ హిస్ట‌రీలో, సీడెడ్ హిస్ట‌రీలో ఇంత గొప్ప రికార్డ్ ఉన్న హీరో బాల‌య్య ఒక్క‌డే.

ఎమ్మిగ‌నూరులో 100 రోజులు డైరెక్టుగా ఆడిన బాల‌య్య సినిమాల లిస్ట్ ఇదే..
1- పెద్ద‌న్న‌య్య – 104 రోజులు
2- స‌మ‌ర‌సింహారెడ్డి – 177 రోజులు
3- న‌ర‌సింహానాయుడు – 176 రోజులు
4- చెన్న‌కేశ‌వ‌రెడ్డి – 105 రోజులు
5- ల‌క్ష్మీన‌ర‌సింహా – 102 రోజులు
6- సింహా – 107 రోజులు
7- లెజెండ్ – 421 రోజులు
8- డిక్టేట‌ర్ – 103 రోజులు
9- గౌత‌మీపుత్ర శాత‌కర్ణి – 105 రోజులు
10- జై సింహా – 100 రోజులు
11- అఖండ – 100 రోజులు క‌న్‌ఫార్మ్‌

ఈ 11 సినిమాలు మాత్ర‌మే కాకుండా ఇక్క‌డ బాల‌య్య న‌టించిన మ‌రికొన్ని సినిమాలు కూడా షిఫ్టుల‌తో 100 రోజులు ఆడాయి. అయితే ఇవి డైరెక్టుగా 4 ఆట‌ల‌తో శ‌త‌దినోత్స‌వాలు జ‌రుపుకున్నాయి. ఇక స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు అయితే ర‌జ‌తోత్స‌వం జ‌రుపుకుంటే.. లెజెండ్ ఏకంగా 421 రోజులు ఆడి తెలుగు సినిమా చ‌రిత్ర తిర‌గ‌రాసింది.

ఇక 2016 – 2017 – 2018 సంక్రాంతికి వ‌రుస‌గా వ‌చ్చిన డిక్టేట‌ర్ – శాత‌క‌ర్ణి – జై సింహా మూడు కూడా సెంచ‌రీలు కొట్టేశాయి. ఏదేమైనా ఎమ్మిగ‌నూరు అంటేనే బాల‌య్య అడ్డాగా మారింది. ఈ రికార్డుల‌ను ఇప్ప‌ట్లో తిర‌గ‌రాసే వాళ్లు కూడా లేరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news