Moviesఆ హీరోయిన్‌కు మ‌హేష్ కావాల‌ట‌.. మామూలు సోపు వేయ‌డం లేదుగా...!

ఆ హీరోయిన్‌కు మ‌హేష్ కావాల‌ట‌.. మామూలు సోపు వేయ‌డం లేదుగా…!

సినిమా రంగంలోకి వచ్చిన యువ హీరోలు కానీ… హీరోయిన్లు కానీ ఒకటి రెండు హిట్లు వస్తే చాలు అందరి దృష్టిలో పడేందుకు రకరకాల ప్రణాళికలు వేస్తూ ఉంటారు. మీరు ఏ ఉద్దేశంతో ఈ రంగంలోకి వచ్చారు ? అని అడిగితే తాను ఫలానా హీరోతో నటించాలని కోరికతో వచ్చానని… ఆ హీరో అంటే తనకు చాలా ఇష్టం అని చెబుతుంటారు. హీరోల కన్నా హీరోయిన్ల ఎక్కువగా ఇలాంటి సోపులు వేస్తూ ఉంటారు. అప్పుడు ఇండ‌స్ట్రీలో ముందువరుసలో ఎవరు అయితే స్టార్ హీరోలుగా ఉన్నారో ? వారి పేర్లే ఎక్కువగా చెబుతూ ఉంటారు. తాజాగా పెళ్లి సందD సినిమా తో ఒక్కసారిగా దూసుకుపోతోంది బెంగళూరు బ్యూటీ శ్రీలీల‌.

శ్రీలీల‌ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ. ఆ తర్వాత బెంగుళూరులో స్థిరపడిన శ్రీలీల రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందD సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా అదిరిపోయే వసూళ్లు సాధించి సూపర్ హిట్ అయింది. దీనికి ప్రధాన కారణం శ్రీలీలే అన్న టాక్‌ ఇండస్ట్రీలో వచ్చేసింది. మొత్తానికి పెళ్లి సందD హిట్ అవ్వ‌డంతో పాటు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన ఒక సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల స‌ర‌స‌న‌ ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ – కొర‌టాల శివ సినిమాలో కూడా ఆమెకు సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వ‌చ్చింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా శ్రీలీల మహేష్ బాబుకి మాత్రమే మనం బాగా మ్యాచ్ అవుతాం అని… అలాంటి ఆఫర్ కోసమే వెయిట్ చేస్తున్నా అని ఇండ‌స్ట్రీలో త‌న స‌న్నిహితుల‌తో చెబుతోందట.

శ్రీలీల‌కు అటు అందంతో పాటు అభినయం కూడా ఉంది. పెళ్లి సందD సినిమాతోనే ఆమె ఇండస్ట్రీలో చాలా మంది దర్శక నిర్మాతలు, హీరోలు దృష్టిలో పడిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమెకు నాలుగైదు సినిమాల్లో మంచి ఆఫర్లు వచ్చాయి. యూత్ ను కూడా బాగా కట్టిపడేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరింత పాపులర్ అయ్యింది. ఆమె ఏకంగా మహేష్ కోసం వెయిట్ చేస్తున్నా అని పెద్ద బాంబు పేల్చింది. మరి శ్రీలీల కోరిక నెరవేరుతుందో లేదో చూద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news