Moviesస‌దా చెంప చెల్లుమ‌నిపించిన డైరెక్ట‌ర్‌.. అస‌లేమైందో తెలిస్తే షాకే!

స‌దా చెంప చెల్లుమ‌నిపించిన డైరెక్ట‌ర్‌.. అస‌లేమైందో తెలిస్తే షాకే!

హీరోయిన్ స‌దా అంటే తెలియ‌ని సినీ ప్రియుడు ఉండ‌డు. మహారాష్ట్రలోని రత్నగిరి లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన స‌దా.. `జ‌యం` చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన ఈ అందాల భామ‌.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ద్విభాషా చిత్రం `అపరిచితుడు` లో విక్ర‌మ్‌కు జోడీగా న‌టించి మంచి గుర్తింపు ద‌క్కించుకుంది.

కానీ, కొత్త హీరోయిన్ల రాక‌, సినిమాల ఎంపిక‌లో పొర‌పాట్ల వ‌ల్ల స‌దా కెరీర్ క్ర‌మంగా డ‌ల్ అయిపోయింది. ప్ర‌స్తుతం స‌దా సినిమాలు ఏమీ చేయ‌క‌పోయినా.. సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ను ర‌న్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. దక్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న స‌దాను ఓ డైరెక్ట‌ర్ చెంప చెల్లుమ‌నిపించారాట‌. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో.. అస‌లేం జ‌రిగిందో.. తెలియాలంటే లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే.

నితిన్, స‌దా జంట‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ తెర‌కెక్కించిన ప్రేమ‌క‌థా చిత్రం `జ‌యం`. స‌దాకే కాదు, నితిన్‌కు సైతం ఇదే డ‌బ్యూ మూవీనే. చిత్రం మూవీస్ బ్యాన‌ర్‌పై తేజ స్వ‌యంగా నిర్మించిన ఈ చిత్రంలో హీరో గోపీచంద్ విల‌న్‌గా న‌టించాడు. ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించిన ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా 2002 జూన్ 14న విడుద‌లై భారీ విజ‌యం సాధించింది.

వాస్త‌వానికి ఈ సినిమా కేవలం రూ.3.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్ర‌మే చేసింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రూ.15.16 కోట్ల షేర్ ను రాబట్టి.. జ‌యం సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఒక సన్నివేశంలో హీరోయిన్ సదా ఏడ‌వాల్సి ఉంటుంది. అయితే ఆ షాట్‌లో సదాకు ఏడవడం చేత కాకపోవడంతో.. టేకులు మీద టేకులు తీసుకుంటుంద‌ట‌. దాంతో డైరెక్ట‌ర్ తేజ లాగి పెట్టి స‌దా చెంపపై ఒక్క‌టివ్వ‌డంతో.. అక్క‌డి వారంతా షాక్ అయ్యార‌ట‌. మ‌రోవైపు తేజ కొట్టిన చెంప దెబ్బ‌కు స‌దా నిజంగా ఏడ్చేయడంతో.. అప్పుడు సీన్ బాగా ప‌డింద‌ట‌. ఈ విష‌యాన్ని గ‌తంలో స‌దా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news