Moviesబాల‌య్య సినిమానే రిజెక్ట్ చేసిన రాశి.. అర‌రే పెద్ద త‌ప్పే చేసిందిగా!

బాల‌య్య సినిమానే రిజెక్ట్ చేసిన రాశి.. అర‌రే పెద్ద త‌ప్పే చేసిందిగా!

సీనియ‌ర్ హీరోయిన్ రాశి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ చేసిన రాశి.. పదహారేళ్లకే హీరోయిన్‌గా మారి త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన రాశి.. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాను మాత్రం రిజెక్ట్ చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

బాల‌కృష్ణ హీరోగా బి.గోపాల్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `సమరసింహారెడ్డి`. శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై చెంగల వెంకట రావు నిర్మించిన ఈ చిత్రంలో సిమ్రాన్, అంజలా జవేరి హీరోయిన్లుగా న‌టించారు. 13 జనవరి 1999న విడుద‌లైన ఈ ఫ్యాక్షన్ సినిమా భారీ విజ‌యం సాధించింది. ఈ చిత్రం తెలుగులో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను క్రాస్ చేసింది.

రూ.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.16 కోట్లు వసూలు చేసిందంటే ఏ రేంజిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్యాక్షన్ సినిమాల ఒరవడికి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలో మొద‌ట రాశిని హీరోయిన్‌గా అనుకున్నార‌ట‌. దర్శకుడు బి . గోపాల్ ఆమెను సంప్రదించి కథ కూడా పూర్తిగా వివరించార‌ట‌.

కానీ, ఈ చిత్రంలో హీరోయిన్ తో సీతాకోకచిలుక సీన్ ఉంటుంది. ఆ సీన్ నచ్చకపోవడంతో రాశి అంత పెద్ద చిత్రాన్ని వదులేసుకుంది. దాంతో డైరెక్ట‌ర్ బి. గోపాల్ రాశికి బదులుగా సిమ్రాన్‌ను తీసుకున్నారు. ఒకవేళ రాశి సమరసింహారెడ్డి సినిమా చేసుంటే.. ఆమె కెరీర్‌కు మ‌రింత ప్ల‌స్ అయ్యేది. అన‌వ‌స‌రంగా వ‌దులుకుని రాశి పెద్ద త‌ప్పు చేసిందే అని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news