Moviesహంసానందిని క్యాన్స‌ర్‌పై తార‌క్ ఎమోష‌న‌ల్ కామెంట్‌..!

హంసానందిని క్యాన్స‌ర్‌పై తార‌క్ ఎమోష‌న‌ల్ కామెంట్‌..!

చేసింది త‌క్కువ సినిమాలే అయినా హీరోయిన్ హంసానందిని తెలుగు ప్రేక్ష‌కుల మైండ్‌లో అలా ప‌డిపోయింది. అటు హైట్‌తో పాటు అందం, అభిన‌యం ఆమె సొంతం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమె చిన్నా చిత‌కా పాత్ర‌లు చేసింది. తాజాగా ఆమె రొమ్ము క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతోన్న విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించింది. ఆమె త‌న రొమ్ము క్యాన్స‌ర్ ఎలా క‌నుగొంది ? ఎలా చికిత్స తీసుకుంటోందో ? స్వ‌యంగా నోట్ రాసింది. దీంతో అంద‌రూ షాక్ అవ్వ‌డంతో పాటు హంసా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు.

ఈ క్యాన్స‌ర్ భారీన ప‌డ‌డంతో తాను అత్యంత క్లిష్ట‌మైన కీమోథెర‌పీ సెష‌న్‌కు కూడా వెళ్లాల్సి వ‌చ్చింద‌ని.. అయితే తాను ధైర్యంగానే ఉన్నాన‌ని చెప్పింది. ఇక కీమోథెర‌ఫీ త‌ర్వాత హంసా రూపం పూర్తిగా మారిపోయింది. ఈ క్ర‌మంలోనే ప‌లువురు సినీ, ఇతర రంగాల‌కు చెందిన సెల‌బ్రిటీల‌తో పాటు ఆమె అభిమానులు కూడా ఆమెకు సోష‌ల్ మీడియాలో స‌పోర్ట్‌గా నిలుస్తున్నారు.

తాజాగా హంస పాస్టెల్ సూట్ ధరించిన ఫొటో షేర్ చేశారు. దానికి మ‌నీష్ మ‌ల్హోత్రా మీరు చాలా టెన్ష‌న్‌గా ఉన్నారు… క్యాన్స‌ర్‌తో మీ పోరాటం ప్ర‌యాణంలో భాగం మాత్ర‌మే… మీరు విజేత‌గా నిల‌వ‌డంతో పాటు మ‌రింత అందంగా ఉంటార‌ని కామెంట్ చేశాడు. ఇదే ఫొటోకు తార‌క్ కూడా స్పందించాడు. తార‌క్ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తాను హంస రొమ్ము క్యాన్స‌ర్‌తో యుద్ధం గురించి తాను విన్నాను అని… నిజంగా చాలా క్ష‌మించండి.. ఆమెకు దేవుడు అన్ని ర‌కాలుగా శ‌క్తిని ఇచ్చి దీవిస్తాడు అని ఆకాంక్షించాడు.

ఆమె దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఓ పోరాట యోధుడిలా పోరాడి బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని తాను అనుకుంటున్నాన‌ని తార‌క్ చెప్పాడు. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమాలో హంస ఓ గెస్ట్ రోల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news