Moviesటాలీవుడ్‌లో మ‌రో జంట‌ విడాకులు ... ఇది కూడా ప్రేమ పెళ్లే...

టాలీవుడ్‌లో మ‌రో జంట‌ విడాకులు … ఇది కూడా ప్రేమ పెళ్లే ..!

కరోనా మహమ్మారి ప్రపంచంపై ఎప్పుడు ఎటాక్ చేసిందో కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆర్థిక పరిస్థితులతో పాటు మానసిక పరిస్థితుల పై తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్టు కనిపిస్తోంది. ప్రజల జీవన స్థితిగతులను మార్చేసింది. అసలు గతంలో ఎప్పుడూ లేనంత అసహనాన్ని కలిగించడంతో అవి తీవ్రమైన పరిణామాలకు కారణాలు అవుతున్నాయి. కోవిడ్ టైంలో ఎవరికి వారు పనులు మానుకుని ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతున్న క్రమంలో బంధాలు బలపడతాయి అని విశ్లేషకులు భావించారు. అయితే వ్యక్తుల మధ్య అపార్థాలు పెరిగి బంధాలు బలహీన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

క‌రోనా ప్రారంభమయ్యాక ఎంతో మంది సెలబ్రిటీలు విడిపోతే అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంటలు కూడా కరోనా వచ్చాక చాలా సింపుల్ గా విడిపోతున్నాయి. అక్కినేని హీరో నాగచైతన్య – సమంత విడాకులు తీసుకోవడం ఎంతో మందిని బాధపెట్టింది. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య – హీరో ధనుష్ 18 సంవత్సరాల దాంపత్య జీవితానికి తెరదించుతూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారు. ఇటీవల కాలంలో అమీర్ ఖాన్ – కిర‌ణ్‌రావు విడాకులు కూడా ఎంతోమందిని బాధ‌పెట్టాయి.

ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు చాలా సింపుల్గా విడిపోతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో టాలీవుడ్ కి చెందిన మరో జంట చేరినట్టు తెలుస్తోంది. పెళ్లిచూపులు సినిమాతో సంచలనం క్రియేట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తన భార్య ల‌త నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారా ? అన్నది క్లారిటీ లేదు కానీ ప్రస్తుతానికి అయితే విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తరుణ్, ల‌త‌ల‌ది ప్రేమ వివాహం.

ఈ నగరానికి ఏమైంది సినిమాలో మ‌నం చూసింది త‌రుణ్ వ్య‌క్తిగ‌త జీవిత‌మే. అందులో అనీషా ఆంబ్రోస్ పాత్ర ల‌త జీవితం నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న‌దే ట‌. త‌రుణ్ ద‌ర్శ‌కుడిగా మార‌డానికి ముందే ఫ్యాష‌న్ డిజైన‌ర్ అయిన ల‌త‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. చాలా ఇంట‌ర్వ్యూల్లో సైతం త‌న భార్య గురించి గొప్ప‌గా చెప్పాడు. త‌రుణ్ సినిమాల మేకింగ్‌లో సైతం ఆమె పాత్ర ఉంటుంది. ఎంతో అండ‌ర్ స్టాండింగ్‌తో ఉండే ఈ జంట విడిపోవ‌డం వారి స‌న్నిహితుల‌కు కూడా షాకింగ్‌గా మారింద‌ట‌. అయితే వీరి విడాకుల‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news