Moviesఅల్లువారి అబ్బాయి పై దారుణమైన కామెంట్స్..బన్నీ చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చిన్నట్లేగా..?

అల్లువారి అబ్బాయి పై దారుణమైన కామెంట్స్..బన్నీ చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చిన్నట్లేగా..?

టాలీవుడ్ లో అల్లు వారి ఫ్యామిలీకి ఓ ప్రత్యేకమైన స్దానం ఉంది. దివంగత అల్లు రామలింగయ్య అలాంటి మంచి పేరును సెట్ చేసారు. తనదైన కామెడీ టైమింగ్ తో నటనతో ఎన్నో సినిమాలో నటించి మెప్పించిన రామలింగయ్య..చిరంజీవి హీరో గా ఎదగడానికి ఎంతో హెల్ప్ చేసారు అన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన అల్లు అరవింద్..పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయినా..నిర్మాతగా మాత్రం మంచి పేరును సంపాదించుకున్నారు.

ఇక ఆయనకి ముగ్గురు కొడుకులు. అందులో అల్లు అర్జున్,శిరీష్..టాలీవుడ్ లో హీరో గా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఇక్కడ ముఖ్యం గా మనం చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ గురించి. రీసెంట్ గా చేసిన పాన్ ఇండియా సినిమాతో తిరుగులేని విజయాని అందుకున్న ఈయన..గంగోత్రి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తరువాత వచ్చిన బన్నీ,హ్యాపీ సినిమాలు కూడా హిట్ కావడంతో అల్లు అర్జున్ పేరు స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయింది.

అయితే, నటన పరంగా బన్నీ సూపర్ అందులో మనం వేళ్లు పెట్టాల్సిన అవసరమే లేదు. కానీ సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆయన ముఖం చూసి చాలా మంది జనం నవ్వుకున్నారట. మెగా ఫ్యామిలీ హీరో అంటే ఎలా ఉండాలి..ఇతను ఏంటి ఇలా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేసారట. అయితే బన్నీ అన్నీ అవమానాలు చవిచూసిన..లోపల బాధపడుతున్న బయటికి ఎప్పుడు చిరునవ్వుతో ఉంటూ.. ఎవరికీ బాధ పడినట్లు కనబడకుండా మేనేజ్ చేసేవాడట.

అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ సక్సెస్, ఫ్లాప్ సినిమాలు పడినా ఏ మాత్రం బాధ,భయం పడకుండా తన కష్టానే నమ్ముకుంటూ..ఇప్పుడు 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్దాయి కి ఎదిగారు అంటే అది ఖచ్చితంగా బన్ని కి ఉన్న పట్టుదల నటన పై ఉన్న ఇష్టం అనే చెప్పాలి. ఇక అలా తన పై కామెంట్స్ చేసే వారికి బన్నీ చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చిన్నట్లైంది అంటారు ఆయన అభిమానులు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ తో పుష్ప 2 సినిమా కి కమిట్ అయ్యి ఉన్నాడు. ఇక ఆ తరువాత లిస్ట్ లో బడా బడా డైరెక్టర్స్ కూడా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news