Moviesబతిమిలాడినా కూడా వదలలేదు..ప్రియా వారియర్ బయటపెట్టిన షాకింగ్ నిజాలు ఇవే..!!

బతిమిలాడినా కూడా వదలలేదు..ప్రియా వారియర్ బయటపెట్టిన షాకింగ్ నిజాలు ఇవే..!!

వామ్మో.. ఒక్కప్పుడు సినిమాలో అవకాశాలు రావలంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో ఆడిషన్స్ కు వెళ్ళాలి.. చెప్పులు అరిగేలా తిరగాలి అయినా ఆఫర్లు వస్తాయా అంటే రావు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆ బాధ నే లేకుండా పోయింది. తమ టాలెంట్ ను సోషల్ మీడియా వేదిక ద్వారనే అందరికి తెలియజేసేలా చేస్తున్నారు. తర్వాత షార్ట్ ఫిలిం ద్వారా లేదా రీల్స్ ద్వారా పాపులర్ అయ్యి సినిమా అవకాశాలను సొంతం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. అదే కోవకు చెందింది బ్యూటీ ప్రియా వారియర్.

’ఒరు ఆడార్ ల‌వ్’ సినిమాలో క‌న్ను కొట్టే ఒక్క సీన్‌ తన జీవితానే మార్చేసింది.సోష‌ల్ మీడియాలో చిన్న‌గా క‌న్నుగీటి దేశ‌వ్యాప్తంగా ఉన్న కుర్రాళ్లంద‌రిని ఒకే ఒక్క వీడియోతో త‌న వైపున‌కు తిప్పుకున్న వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్. ఇప్పటికే పలు చిత్రాలల్లో హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టకపోయినా..తన నటనకు మంచి మార్కులే వేయించుకున్న ఈ బ్యూటీ ప్రజెంట్ పలు చితలల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. వింక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ కేర‌ళ కుట్టి కి రీసెంట్ ఓ హోట‌ల్‌లో చేదు అనుభ‌వం ఎదురైంది. ఈ విష‌యాన్ని ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చెప్పుకొచ్చింది.

అసలు ఏమైందంటే..ఇటీవలే ఫెర్న్ గొరెగావ్ హోట‌ల్‌లో బస చేసిన అమ్మడుకి ఆ హోటల్ మెనేజ్ మెంట్ చేసిన పని నచ్చలేదట. ఇక ఈ విషయమే ఆమె చ్పెప్పుతూ..”ఫెర్న్ గొరెగావ్ హోట‌ల్‌లో నేను బ‌స చేశాను. ఈ హోట‌ల్ పాల‌సీ ఏంటంటే.. బ‌య‌ట ఫుడ్‌ను లోనికి అస్స‌లు అనుమ‌తించ‌రు. ఎందుకంటే హోటల్ లో ఉండే వాళ్ళు అందరు కూడా అక్కడే ఫుడ్ ఆర్డర్ చేయడంతో వారికి ఆదాయం వస్తుందని హోటల్ యాజమాన్య ఉపాయం.. అయితే ఈ విషయం నాకు తెలియదు. షూటింగ్ నుంచి తిరిగి వ‌చ్చేట‌ప్పుడు దారిలో ఫుడ్ కొనుక్కుని హోట‌ల్‌కు వ‌చ్చాను. కాని అక్కడ వాళ్ళు నన్ను ఆ ఫుడ్ ని లోఫలికి తీసుకెళ్ళనివ్వలేదు. చాలా సేపు బ్రతిమలాను..డబ్బులు పెట్టి ఫుడ్ కొన్నాం కదా.. ఈ సారికి వదిలేయండి అని ఎంత బతిమిలాడినా..వాళ్లు కనికరం చూపలేదు. అంతేకాదు నాతో చాలా అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో నేను ఏం చేయలేక బ‌య‌ట చలిలో భోజ‌నం చేయాల్సి వ‌చ్చింది” అంటూ చెప్పుకొచ్చిందీ ప్రియా వారియ‌ర్‌. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news