Moviesసినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా చేసిన ఈ హీరోయిన్ మరణం..చంపింది ఎవరో తెలుసా..!

సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా చేసిన ఈ హీరోయిన్ మరణం..చంపింది ఎవరో తెలుసా..!

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్ లు అతి తక్కువ టైంలోనే పాపులర్ అయ్యి..మంచి పేరు సంపాదించుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో ఈ భార్గవి కూడా ఒకరు. తన అందంతో సహజమైన నటనతో అందరిని అలరించిన ఈ అమ్మడు మొదటిసారి 2005వ సంవత్సరంలో ఇలియానా హీరోయిన్ గా, రామ్ హీరోగా తొలి పరిచయం దేవదాసు చిత్రం ద్వారా భార్గవి కూడా రెండవ హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే వీరందరికీ మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు.ఈ సినిమాలో భార్గవి నటించిన తీరుకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

ఇక ఈ సినిమాలో అమ్మడు నటన చూసి ఫిదా అయిన డైరెక్టర్స్ పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా ..కొన్ని సినిమాల్లో లీడ్ రోల్ గా ఆఫర్స్ ఇచ్చారు. వచ్చిన ఆఫర్స్ ను సరిగ్గా ఉపయోగించుకున్న ఈ బ్యూటీ.. ఆ తరువాత మా ఊరి వంట, ఆట లాంటి జీ తెలుగు కార్యక్రమాలతోపాటు అమ్మమ్మ డాట్ కామ్, అమృతం వంటి ఎన్నో సీరియల్స్లో కూడా నటించి అభిమానులను మెప్పించింది. ఇక 2008లో నాని హీరోగా, స్వాతి హీరోయిన్ గా తెరకెక్కిన అష్టాచమ్మా చిత్రంలో రెండవ హీరోయిన్ గా భార్గవి స్థానం సంపాదించుకుంది.అటు వెండి తెర పైన ఇటు బుల్లితెర పైన మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న భార్గవి అనతికాలంలోనే జీవితాన్ని ముగించుకుంది.

సినిమాల విషయంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్న భార్గవి..లైఫ్ లో ప్రేమ విషయంలో తప్పటడుగు వేసి..జివితాని నాశనం చేసుకుంది. ప్రవీణ్ అనే వ్యక్తి ప్రేమించిన భార్గవు 2006 ఫిబ్రవరి 12న నెల్లూరులోని మురళీకృష్ణ హోటల్ లో అయన్ని స్నేహితుల సమక్షంలో పెళ్ళి చేసుకుంది.. కానీ భార్గవి 2008 డిసెంబర్ 16న హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన స్వగృహంలో తన భర్త ప్రవీణ్ చేతిలో హత్యకు గురైంది. ఇక భార్గవిని చంపిన ప్రవీణ్ , ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏమిటంటే, ప్రవీణ్ భార్గవిని పెళ్లి చేసుకోక ముందే, రెండు వివాహాలు చేసుకోవడం గమనార్హం. తనకు పెళ్లి అయ్యిందనే విషయం దాచిపెట్టిన ప్రవీణ్..భార్గవికి అసలు నిజం తెలియదంతోనే ఆమె కిరాతకంగా చంపేశారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేసాయి. ఒక్కవేళ భార్గవి బ్రతికి ఉన్నుంటే ఇప్పుడే ఖచ్చితంగా టాప్ పోజీషన్ లో ఉండేది అన అంటుంటారు ఆమె స్నెహితులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news