Moviesఫుల్ క్లారిటీ... మెగా అభిమానుల మ‌దిని దోచేసిన బాల‌య్య‌..!

ఫుల్ క్లారిటీ… మెగా అభిమానుల మ‌దిని దోచేసిన బాల‌య్య‌..!

మెగాస్టార్ చిరంజీవి – యువ‌ర‌త్న బాల‌కృష్ణ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ద‌శాబ్దాలుగా స్టార్ హీరోలుగా, సీనియ‌ర్ హీరోలుగా కొన‌సాగుతున్నారు. అటు చిరంజీవి మెగా బ్రాండ్‌ను, ఇటు బాల‌య్య నంద‌మూరి బ్రాండ్‌ను కంటిన్యూ చేస్తున్నారు. ఈ ఇద్ద‌రు హీరోలు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీప‌డుతూ బాక్సాఫీస్‌ను హీటెక్కిస్తూ ఉంటారు. ఈ ఇద్ద‌రు హీరోల అభిమానుల మ‌ధ్య ఎప్పుడూ ప్ర‌చ్ఛ‌న్న యుద్ధ‌మే ఉంటుంది.

ఇక రాజ‌కీయ ప‌రంగా కూడా బాల‌య్య ముందు నుంచి టీడీపీలో ఉంటూ.. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. ఇక చిరంజీవి కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్ర‌జారాజ్యం పార్టీతో ఎమ్మెల్యే అయ్యి.. ఆ త‌ర్వాత కాంగ్రెస్ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎంపికై కేంద్ర స‌హాయ‌మంత్రిగా ఉన్నారు. ఎలా ఎవ‌రి దారుల్లో వారు ఉన్నత స్థానాల్లో ఉండేందుకే ఎప్పుడూ ప్ర‌య‌త్నించారు. ఇదే వీరి మ‌ధ్య గ్యాప్ ఉంద‌న్న ప్ర‌చారానికి బాగా కార‌ణ‌మైంది.

 

అయితే బాల‌య్య హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాప‌బుల్ వేదిక‌గా ఈ రూమ‌ర్ల‌కు క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సోష‌ల్ మీడియా యుగంలో ఎవ‌డికి వాడు ఏది తోస్తే అది రాసేస్తున్నార‌ని.. లొకేష‌న్ తెలియ‌దు.. అడ్ర‌స్ ఉండ‌దు.. బాధ్య‌త తెలియ‌కుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ బాల‌య్య మండిప‌డ్డారు. బాల‌య్య‌కు – ర‌వితేజ‌కు ప‌డ‌దు.. చిరంజీవి – బాల‌కృష్ణ ఫోన్లో మాట్లాడుకోరు అని అంటారు.. లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయ్యింది.. దొరికితే ద‌వ‌డ ప‌గిలిపోద్ద‌ని వార్నింగ్ ఇచ్చారు.

ఊరు పేరు చెప్పుకోవ‌డానికి ధైర్యం లేని ఈ వెధ‌వ‌ల‌ను క్ష‌మిద్దాం.. మ‌న మీద వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను మ‌నం ప్రేమించిన‌ప్పుడే మ‌నం అన్‌స్టాప‌బుల్ అవుతాం అని బాల‌య్య చెప్పుకొచ్చాడు. వృత్తిప‌ర‌మైన వార్‌లో భాగంగానే బాల‌య్య‌, చిరు పోటీప‌డ‌తారే త‌ప్పా.. నిజంగా వారిమ‌ధ్య అంత ప‌గ ఉండ‌డానికి కూడా ప్ర‌త్యేక‌మైన కార‌ణాలు లేవు.

ఇక బాల‌య్య ఇంత చ‌క్క‌టి క్లారిటీ ఇవ్వ‌డంతో పాటు బాల‌య్య అభిమానుల‌తో పాటు మెగా అభిమానులు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాల‌య్య వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో ఎంతో మందికి ఆద‌ర్శంగా ఉన్నామ‌ని కితాబు ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news