Moviesధ‌నుష్ - ఐశ్వ‌ర్య విడాకుల‌కు ఇదే కార‌ణ‌మైందా...!

ధ‌నుష్ – ఐశ్వ‌ర్య విడాకుల‌కు ఇదే కార‌ణ‌మైందా…!

సౌత్ ఇండియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ హీరో ధ‌నుష్‌, అత‌డి భార్య ఐశ్వ‌ర్య ( సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె) విడాకులు తీసుకుంటున్న‌ట్టు సోమ‌వారం రాత్రి సంయుక్తంగా ప్ర‌క‌టించారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 18 సంవ‌త్స‌రాల పాటు క‌లిసి జీవించారు. త‌మ 18 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా క‌లిసి మెలిసి ఉన్నామ‌ని ప్ర‌క‌న‌ట చేశారు. సోమ‌వారం రాత్రి ఇద్ద‌రు త‌మ ట్విట్ట‌ర్ అక్కౌంట్ల‌లో వేర్వేరుగా చేసిన ఈ ప్ర‌క‌ట‌న చూసిన వారంతా ఒక్క‌సారిగా షాక్‌లోకి వెళ్లిపోయారు.

లోప‌ల పేరు మాత్ర‌మే మార్పు త‌ప్పా.. ఇద్ద‌రూ క‌లిసి స‌మంత‌, చైత‌న్య‌లాగానే ఒకే ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 18 ఏళ్ల వైవాహిక జీవితంలో దంప‌తులుగా, స్నేహితులుగా, త‌ల్లిదండ్రులుగా, ప‌ర‌స్ప‌ర శ్రేయోభిలాషులుగా క‌లిసి ఉన్నామ‌ని..ఈ 18 ఏళ్లో ఎన్నో విష‌యాల్లో తాము స‌ర్దుకుపోయామ‌ని.. అయితే ఇప్పుడు ఇద్ద‌రివి వేర్వేరు మార్గాలుగా క‌న‌ప‌డుతున్నాయ‌ని.. అందుకే తాము త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు.

మంచి భ‌విష్య‌త్తుతో పాటు మేం ఇద్ద‌రం.. అర్థం చేసుకోవ‌డానికి కొంత టైం ప‌డుతుంద‌ని.. మా నిర్ణ‌యాన్ని అంద‌రూ గౌర‌వించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్టు ఐశ్వ‌ర్య చెప్పింది. ప్రేమించుకున్న ఈ ఐశ్వ‌ర్య‌, ధ‌నుష్ పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరు న‌వంబ‌ర్ 18, 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్రా రాజా (15), లింగ‌రాజా (11) అనే ఇద్ద‌రు కుమారులు ఉన్నారు.

ఇక ధ‌నుష్ – ఐశ్వ‌ర్య ప్రేమించుకోవ‌డం కూడా చిత్రంగానే జ‌రిగింది. ధ‌నుష్ సోద‌రి, ఐశ్వ‌ర్య బెస్ట్ ఫ్రెండ్స్‌. అలా వారిద్ద‌రి స్నేహం కాస్తా ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య ప‌రిచ‌యానికి కార‌ణ‌మైంది. అలా వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించి.. వారు పెళ్లి చేసుకునే వ‌ర‌కు వెళ్లింది. అయితే ఇప్పుడు ఇగోల‌తో పాటు అనుమానాలు, ఎవరికి వారు సర్దుకుపోలేక‌పోవ‌డం లాంటి కార‌ణాల‌తోనే వీరు విడిపోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక ర‌జ‌నీకాంత్ ఇద్ద‌రు కూతుళ్ల వైవాహిక జీవితాలు ఒడిదుడుకుల‌కు లోన‌య్యాయి. ర‌జ‌నీ మ‌రో కుమార్తె సౌంద‌ర్య సైతం త‌న మొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసింది. ఇప్పుడు ఐశ్వ‌ర్య జీవితం హ్యాపీగా కొన‌సాగుతోంది అనుకుంటే ఆమె కూడా ధ‌నుష్‌కు విడాకులు ఇవ్వ‌డంతో ర‌జ‌నీ అభిమానులు సైతం క‌ల‌త చెందుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news