Moviesమా పిల్లాడిది ఏం తప్పులేదు..అంతా ఆమెనే చేసింది..వామ్మో ఇదేం ట్వీస్ట్ సామీ..?

మా పిల్లాడిది ఏం తప్పులేదు..అంతా ఆమెనే చేసింది..వామ్మో ఇదేం ట్వీస్ట్ సామీ..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున – యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబోలో తెర‌కెక్కిన సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా సీనియర్ హీరోయిన్ రమ్యకృషణ..అలాగే నాగచైతన్య కు జోడీగా లెటేస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి నటీంచింది. విడుదలైన మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా..బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుసీ అవుతున్నారు.

సోగ్గాడే చిన్ని నాయ‌న నాగ్ కెరీర్‌లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా అదే కుర‌సాల క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ బంగార్రాజు సినిమా తెర‌కెక్కింది. నాగార్జున స్వ‌యంగా అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను నిర్మించారు. కాగా..పెద్ద పెద్ద సినిమాలు కరోనా ఆంక్షలుకారణంగా సంక్రాంతి రేస్ నుండి తప్పించుకోగా..ఫైనల్ గా ఆ రేస్ లో బంగార్రాజు నిలిచి..హిట్ అందుకోవడమే కాకుండా..అసలైన బాక్స్ ఆఫిస్ కు అసలైన పండగ తీసుకొచ్చాడు.

ఇక బంగార్రాజు ఈవెంట్ లో ఓ వీడియో తెగ వైరల్ గా మారిది. ‘బంగార్రాజు’ ఈవెంట్‌లో నాగచైతన్య, నటి దక్ష వీడయో నెట్టింట చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. స్టేజ్‌పై నాగార్జున మాట్లాడుతుంటే చైతన్య, హీరోయిన్‌ దక్ష వైపు చూడగా.. ఆమె కొంటెగ్గా కనుబొమ్మలు ఎగిరేయడంతో చై సిగ్గుపడిపోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తూ వైరల్‌ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఇక రీసెంట్ గా ఈ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ వీడియో పై క్లారిటీ ఇస్తూ..ఇందులో తప్పంత అమ్మాయిదే..నాగచైతన్య గుడ్ బాయ్ అన్నట్లు మాట్లాడాడు.

కళ్యాణ్ మాట్లాడుతూ..”స్టెజీ పై నాగ్‌ సార్‌ మాట్లాడుతుంటే ఏదో సౌండ్‌ వినిపించింది..వెంటనే చైతన్య వెనక్కి తిరిగిచూశాడు. దీంతో దక్ష అతడిని చూసి కళ్లు ఎగిరేసింది. దానికి చైతన్య సిగ్గుపడుతూ స్మైల్ ఇచ్చాడు. ఇక్కడ చైతన్య ది తప్పు లేదు. ఆయన స్వభావమే అంతా. దేనికైన సిగ్గు పడతాడు. అస్సలు ఇదంతా దక్ష వల్లే జరిగింది అంటూ ఫేస్ మీదనే చెప్పేసాడు. చైతన్యది ఏం లేదు, అంతా నువ్వే చేశావు” అంటూ హీరోయిన్‌ వైపు చూస్తూ అన్నాడు. దీంతో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news