Moviesఈ స్టార్ సెల‌బ్రిటీలు ఒక‌ప్పుడు క్లాస్‌మెట్స్‌... మీకు తెలుసా..!

ఈ స్టార్ సెల‌బ్రిటీలు ఒక‌ప్పుడు క్లాస్‌మెట్స్‌… మీకు తెలుసా..!

సెల‌బ్రిటీల ప‌ర్స‌న‌ల్ విష‌యాల గురించి తెలుసుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రికి చాలా ఇంట్ర‌స్ట్ ఉంటుంది. అందులోనూ సోష‌ల్ మీడియా యుగంలో ప్ర‌తి ఒక్క సెల‌బ్రిటీ ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు, ఫ్యామిలీ లైఫ్ గురించి తెలుసుకోవాల‌న్న ఆతృత ఎక్కువ అవుతోంది. అందుకే సెల‌బ్రిటీల విష‌యాలు సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తూ ఉంటాయి. ఇక టాలీవుడ్‌, బాలీవుడ్‌లో ప‌లువురు సెల‌బ్రిటీలు చిన్న‌ప్పుడు క్లాస్‌మెట్స్‌గా ఉన్నారు. ఆ త‌ర్వాత వాళ్లే ఇండ‌స్ట్రీ స్టార్లు అయిపోయారు. ఆ సెల‌బ్రిటీలు ఎవ‌రెవ‌రో ? ఏంటో తెలుసుకుందాం.

నాని- ప్ర‌దీప్‌:
టాలీవుడ్ నేచుర‌ల్ స్టార్ నాని ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వ‌చ్చి తిరుగులేని హీరో అయిపోయాడు. ఎలాంటి సినిమా నేప‌థ్యం లేక‌పోయినా ఎలా ఎద‌గాలో అని ఉదాహ‌ర‌ణ చెప్పేందుకు ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు నాని పేరు చెపుతున్నారు. నాని, యాంక‌ర్‌, హీరో ప్ర‌దీప్ మాచిరాజు క్లాస్‌మెట్స్‌. వీరిద్ద‌రు క‌లిసి హైద‌రాబాద్‌లోని సెంట్ అల్పోన్సా స్కూల్లో క‌లిసి చ‌దువుకున్నారు. వీరిద్ద‌రు స్కూల్లో టాప‌ర్స్‌గా ఉండేవార‌ట‌. ఈ విష‌యాన్ని నాని, ప్ర‌దీప్ స్వ‌యంగా చెప్పారు.

వీరు టాప్ అన్న‌ది చ‌దువులో కాద‌ట‌. సొల్లు క‌బుర్లు చెప్పుకోవ‌డంలో అట‌. స్కూల్ బిల్డింగ్ పైకి ఎక్కి చాలా సార్లు టైం పాస్ క‌బుర్లు చెప్పుకునేవాళ్లం అని ఈ ఇద్ద‌రు గ‌తంలో చెప్పారు. ఇక ఇప్పుడు ఇండ‌స్ట్రీలో నానితో పాటు ప్ర‌దీప్ ఇద్ద‌రూ కూడా మంచి పొజిష‌న్లేనే ఉన్నారు.

రామ్ చరణ్- రానా- శర్వానంద్:
ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో త‌మ‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు ఈ ముగ్గురు. మెగాస్టార్ త‌న‌యుడిగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ యంగ్ హీరోల‌లో టాప్ పొజిష‌న్లో ఉన్నాడు. ఇక ద‌గ్గుబాటి వార‌సుడిగా రానా బాహుబ‌లిలో భ‌ళ్లాల‌దేవుడి పాత్ర తర్వాత నేష‌న‌ల్ హీరో అయిపోయాడు. ఇక మ‌రో యంగ్ క్రేజీ హీరో శ‌ర్వానంద్‌. వీరు ముగ్గురూ క‌లిసి హైద‌రాబాద్ బేగంపేట‌లో ఉన్న హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్లో క‌లిసి చ‌దువుకున్నారు. అయితే వీరు పెద్ద‌య్యాక సినిమాల్లోకి వ‌చ్చి స్టార్ హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు.

అమీర్ ఖాన్- సల్మాన్ ఖాన్:
బాలీవుడ్‌లో స్టార్ హీరోలు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌, కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కూడా చిన్న‌ప్పుడు క‌లిసి చ‌దువ‌కున్నారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు ఏకంగా దేశం గ‌ర్వించే స్టార్ హీరోలుగా ఎదిగారు. సినిమాల ప‌రంగా, రికార్డుల ప‌రంగా ఇద్ద‌రూ పోటీ ప‌డుతున్నారు.

అనుష్క శ‌ర్మ‌-సాక్షి:
బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భార్య సాక్షిలు సైతం బాల్యంలో క్లాస్‌మేట్స్‌. ఇక విచిత్రం ఏంటంటే వీరు పెద్ద‌య్యాక టీం ఇండియా టాప్ క్రికెట‌ర్ల‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Latest news