Moviesరెడ్ బికినీతో హాట్ దిశా అందాలు చూడ‌లేం బాబోయ్‌..!

రెడ్ బికినీతో హాట్ దిశా అందాలు చూడ‌లేం బాబోయ్‌..!

దిశా ప‌టానీ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగానే యువ‌త‌ను కైపెక్కించే హాట్ హాట్ అందాల భామ‌. బాలీవుడ్లో క్రేజీ కాంబినేష‌న్ల‌లో న‌టిస్తూ మ‌హామ‌హ హీరోయిన్ల‌కే షాక్ ఇస్తోన్న దిశా అందాల‌కు కుర్ర‌కారు ప‌డిపోవాల్సిందే. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దిశా త‌న హాట్ ఫొటోల‌తోనే ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో వేడి పెంచుతూ ఉంటుంది. ఇక దిశా ఇచ్చే బీచ్ బికినీ స్టిల్స్ అయితే కుర్ర‌కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటాయి. ఆమె ఎప్పుడూ ఈ ఫొటోల‌తోనే కుర్రోళ్ల‌ను క‌వ్విస్తూ ఉంటుంది.

తాజాగా ఆమె మ‌రోసారి బీచ్‌లో అందాలు ఆర‌బోసేసింది. రెడ్ హాట్ బికినీ వేసుకుని ఇసుక తిన్నెల్లో ప‌డుకుని చూస్తోన్న ఫొటోలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఈ లుక్‌లో దిశా చాలా సింపుల్ మేక‌ప్‌తో బంగారు చెవిపోగులు, మొడ‌లో చైన్ తో క‌ళ్ల‌తోనే క‌వ్విస్తోంది.

ఇక దిశా ప‌టానీ ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. మెహిత్ సూరి ఏక్ విల‌న్ – 2 త్వ‌ర‌లోనే రిలీజ్ కావాల్సి ఉంది. ఈ యాక్ష‌న్ సినిమాలో సుతారియో, అర్జున్ క‌పూర్‌తో పాటు జాన్ అబ్ర‌హం కూడా న‌టించారు. అలాగే ఏక్తా క‌పూర్ కే – టీనా సినిమాలో కూడా ఆమె న‌టిస్తోంది.

ఇక దిశా తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా లోఫ‌ర్ సినిమాతో ప‌రిచ‌య‌మే. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా వ‌చ్చిన లోఫ‌ర్ సినిమాలో ఆమె న‌టించింది. ఆ ఒక్క సినిమాలో ఆమె అందాల ఆర‌బోత‌కు తెలుగు యూత్ ఫిదా అయిపోయారు. ఇక ఆమెకు తెలుగులో యంగ్ స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారాయి. మ‌ళ్లీ ఆమె తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎప్పుడు ప‌ల‌క‌రిస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news