Moviesబాల‌య్య ' అఖండ ' 40 డేస్ క‌లెక్ష‌న్స్‌... వ‌సూళ్ల జాత‌ర...

బాల‌య్య ‘ అఖండ ‘ 40 డేస్ క‌లెక్ష‌న్స్‌… వ‌సూళ్ల జాత‌ర ఆగ‌లేదు..!

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన భారీ సినిమా అఖండ‌. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. బాల‌య్య కెరీర్‌లో తొలి రు. 100 కోట్ల సినిమాగా రికార్డుల‌కు ఎక్కిన అఖండ ఇప్ప‌టికే రు. 150 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. అటు నైజాంతో పాటు ఇటు ఏపీలో ఇంకా ప‌లు సెంట‌ర్ల‌లో అఖండ రిలీజ్ అవుతోంది.

బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 54 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్ప‌టికే ఈ సినిమాకు రు. 20 కోట్ల పై చిలుకు లాభాలు వ‌చ్చాయి. అఖండ‌కు ముందు బోయ‌పాటి విన‌య విధేయరామ లాంటి డిజాస్ట‌ర్‌తో ఉన్నారు. ఇటు బాల‌య్య కూడా వ‌రుస ప్లాపుల‌తో ఉన్నారు. అయితే సింహా, లెజెండ్ క్రేజ్‌ను కంటిన్యూ చేస్తూ ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది.

బాలయ్య అఖండ 40 రోజులకు 72.70 కోట్ల షేర్ సాధించింది. ఈ సినిమా ఏరియా వైజ్ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 20.65Cr
సీడెడ్ – 15.65Cr
ఉత్తరాంధ్ర – 6.26Cr
ఈస్ట్ – 4.20Cr
వెస్ట్ -4.19Cr
గుంటూరు – 4.75Cr
కృష్ణ – 3.63Cr
నెల్లూరు – 2.62Cr
————————————
ఏపీ + తెలంగాణ = 61.96 కోట్లు
————————————

రెస్ట్ అఫ్ ఇండియా – 5.04 కోట్లు

ఓవర్సీస్ – 5.70 కోట్లు
—————————————
వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 72.70 కోట్లు
—————————————

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news